త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bogatha Waterfall | పాల‌సంద్రంలా ఉప్పొంగుతున్న‌ బొగ‌త జ‌ల‌పాతం.. ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు

Bogatha Waterfall | ఉత్త‌ర తెలంగాణ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు.. స్థానికంగా జ‌ల‌పాతాల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. వ‌ర‌ద కార‌ణంగా ఆయా జ‌ల‌పాతాలు ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నాయి. ప‌చ్చ‌ని అడ‌వుల మ‌ధ్య ఉన్న వాట‌ర్ ఫాల్స్ నాట్య‌మాడుతున్నాయి.

S

Telangana | Published On Jul 21, 2026, 1.54 pm IST

Bogatha Waterfall | పాల‌సంద్రంలా ఉప్పొంగుతున్న‌ బొగ‌త జ‌ల‌పాతం.. ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు
Advertisement

Bogatha Waterfall | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్త‌ర తెలంగాణ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు.. స్థానికంగా జ‌ల‌పాతాల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. వ‌ర‌ద కార‌ణంగా ఆయా జ‌ల‌పాతాలు ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నాయి. ప‌చ్చ‌ని అడ‌వుల మ‌ధ్య ఉన్న వాట‌ర్ ఫాల్స్ నాట్య‌మాడుతున్నాయి. ప‌ర్యాట‌కుల‌ను, ప్ర‌కృతి ప్రేమికులను జ‌ల‌పాతాలు విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

ములుగు జిల్లా వాజేడు మండ‌లం చీకుప‌ల్లి అట‌వీ ప్రాంతంలోని బొగ‌త జ‌ల‌పాతం పాలసంద్రంలా మారింది. ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు క‌లిగిస్తుంది. బొగ‌త ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తుండ‌డంతో జ‌ల‌పాతం వ‌ద్ద అట‌వీశాఖ అధికారులు ఆంక్ష‌లు విధించారు. కేవ‌లం జ‌ల‌పాతాన్ని మాత్ర‌మే వీక్షించాల‌ని, నీళ్ల‌లోకి ఎవ‌రూ దిగొద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

హైద‌రాబాద్‌కు 270 కిలోమీట‌ర్ల దూరంలో..

హైదరాబాద్​కు 270కిలోమీటర్ల దూరంలో బొగత జలపాతం ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని తెలంగాణ నయాగారా అని పిలుస్తుంటారు. వర్షాకాలంలో ఈ జలపాతం ప్రవాహం అధికంగా ఉంటుంది. ఎత్తైన కొండలపై నుంచి పడే నీటి శబ్ధం లయబద్ధంగా వినిపిస్తుంది.

Advertisement
Advertisement