Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
Reverse Waterfall | ఈ వాటర్ ఫాల్ మిగతా జలపాతాలకు( Waterfall ) భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇది రివర్స్ వాటర్‌ఫాల్( Reverse Waterfall ). అన్ని జలపాతాల్లో పైనుంచి కిందకు జలసవ్వడి ఉంటే.. ఈ జలపాతం కింది నుంచి పైకి రివర్స్‌లో పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
Reverse Waterfall | త్రినేత్ర.న్యూస్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రకృతిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అడవులన్నీ ఆకుపచ్చగా మారిపోతాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. జలపాతాలు కనువిందు చేస్తాయి. ఈ జలపాతాల దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఆ మనోహరమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి ప్రకృతి ఒడిలో పులకించిపోతుంటారు. అయితే పర్యాటకులకు ఎంతో కనువిందు చేస్తోంది ఈ జలపాతం. ఈ వాటర్ ఫాల్ మిగతా జలపాతాలకు భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇది రివర్స్ వాటర్‌ఫాల్( Reverse Waterfall ). అన్ని జలపాతాల్లో పైనుంచి కిందకు జలసవ్వడి ఉంటే.. ఈ జలపాతం కింది నుంచి పైకి రివర్స్‌లో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. మరి అంతటి అద్భుతమైన రివర్స్ జలపాతం ఎక్కడుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
రివర్స్ వాటర్‌ఫాల్(Reverse Waterfall).. మహారాష్ట్రలోని నానేఘాట్(Naneghat) కొండల్లో ఉంది. వర్షాకాలంలో ఈ జలపాతం పర్యాటకులకు కనువిందు కలిగిస్తోంది. ఈ జలపాతం ఒక నిలువుగా ఉండే భారీ కొండ అంచు నుండి కిందకు ప్రవహిస్తుంది. వర్షాకాలంలో కింద ఉన్న మైదానాల నుండి వచ్చే అత్యంత శక్తివంతమైన గాలులు ఈ కొండను బలంగా ఢీకొట్టినప్పుడు, ఆ గాలికి పక్కకు వెళ్లే దారి లేక కొండ అంచు గుండా చాలా వేగంగా పైకి దూసుకుపోతుంది.
దీనికి గురుత్వాకర్షణనే కారణం
నీరు కొండ అంచు నుండి కిందకు పడటానికి ప్రయత్నించినప్పుడు, కింద నుండి పైకి వచ్చే ఈ బలమైన ఎదురుగాలి దాన్ని అడ్డుకుంటుంది. నీటిని కిందకు లాగే గురుత్వాకర్షణ శక్తి కంటే, పైకి నెట్టే గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల నీరు కిందకు పడకుండా వెనక్కి, పైకి ఎగసిపడుతుంది.
జలపాతం నుండి పడే నీరు చిన్న చిన్న బిందువుల రూపంలో ఉండటం వల్ల, గాలి వాటిని సులభంగా పైకి నెట్టేయగలదు. అదే మీరు ఒక పెద్ద బండరాయిని అక్కడి నుండి కిందకు వేస్తే, గాలి దాన్ని ఆపలేదు, అది నేరుగా కిందకే పడిపోతుంది. కాబట్టి, అక్కడ ప్రకృతి నియమాలు ఏవీ మారలేదు. గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంది, కానీ దానికంటే బలమైన గాలి ఉధృతి వల్ల నీరు పైకి ప్రవహిస్తున్నట్లు మనకు ఒక అద్భుతమైన భ్రమ కలుగుతుంది అని నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ నుంచి నానేఘాట్ చేరుకోవడం ఎలా..?
హైదరాబాద్ నుంచి నానేఘాట్ కొండ ప్రాంతానికి చేరుకోవాలనుకునే పర్యాటకులు దాదాపు 620 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. షోలాపూర్, పుణె మీదుగా సుమారు 12 గంటల పాటు ప్రయాణించాలి. ఒకవేళ రైలు ప్రయాణం చేస్తే కళ్యాణ్ జంక్షన్ లేదా పుణె జంక్షన్ వద్ద దిగాలి. అక్కడ్నుంచి ట్యాక్సీలో వైశాఖరే గ్రామానికి చేరుకోవాలి.
జులై నుంచి సెప్టెంబర్ వరకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే రివర్స్ వాటర్ ఫాల్ అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఇక ట్రెక్కింగ్ చేసే వారు తప్పనిసరిగా షూ ధరిస్తే బెటర్. రెయిన్‌కోట్, డ్రింకింగ్ వాటర్, స్నాక్స్, ఒక జత దుస్తులు అదనంగా తీసుకెళ్తే మంచిది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..
- ●Hospital Fire | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం
- ●Stock Markets | క్రూడ్ ధరలు, గ్లోబల్ సంకేతాలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- ●Amit Shah | భారత్ ధర్మశాల కాదు.. ఇక్కడ నివసించే హక్కు దేశ ప్రజలకు మాత్రమే ఉంది : అమిత్ షా
- ●Asaduddin Owaisi | ఇస్లాంలో ఏది అవసరమో.. ఏది కాదో నిర్ణయించడానికి మీరెవరు?: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- ●Rahul Gandhi | నటికి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ.. బ్రో వెయిట్ అంటూ కంగన కౌంటర్

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..

Hospital Fire | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం

Stock Markets | క్రూడ్ ధరలు, గ్లోబల్ సంకేతాలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Amit Shah | భారత్ ధర్మశాల కాదు.. ఇక్కడ నివసించే హక్కు దేశ ప్రజలకు మాత్రమే ఉంది : అమిత్ షా






