Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
Hyderabad | ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిపి.. మరో యువతని మోసం చేయాలని చూసిన యువకుడు పోలీసులకు చిక్కాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్న అతడు చివరికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టు ఆధారంగానే పట్టుబడ్డాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిపి.. మరో యువతని మోసం చేయాలని చూసిన యువకుడు పోలీసులకు చిక్కాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్న అతడు చివరికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టు ఆధారంగానే బంజారాహిల్స్ (Hyderabad) పోలీసులకు పట్టుబడ్డాడు.
పవన్ అలియాస్ తరుణ్ అనే యువకుడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో నమ్మించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మోసపోయానని గ్రహించిన ఆ బాలిక.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై పోక్సో కేసు (POCSO Case) నమోదుచేశారు. ఆ కేసులో గత మూడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని స్నేహితుని ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఆధారంగా బంజారాహిల్స్ (Banjarahills) ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఐదుగురు యువతులతో ఒకేసారి ప్రేమ వ్యవహారాలు కొనసాగించినట్లు తేలింది. మరో యువతిని ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. నిందితుడిపై గతంలో చోరీలు, స్నాచింగ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. గత ఆరు నెలల్లోనే అతనిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు తేలింది.
సంబంధిత వార్తలు

Ganesh Laddu Auction | కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో రూ.కోటి పలికిన గణేశ్ లడ్డూ వేలం..
సెప్టెంబర్ 24, 2026

POCSO Case | 11 ఏండ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. యువకుడికి ఐదేండ్ల జైలుశిక్ష
సెప్టెంబర్ 24, 2026

Ganesh immersion | గణేశ్ నిమజ్జన విధులకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Danam Nagender | ఖైరతాబాద్‌లో పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారు : దానం నాగేందర్
- ●Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?
- ●Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు
- ●Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి
- ●BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
- ●PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..

Danam Nagender | ఖైరతాబాద్‌లో పోటీపై సీఎం రేవంత్ స్పష్టత ఇస్తారు : దానం నాగేందర్

Microsoft Surface | స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ప్లస్‌తో కొత్త మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ పీసీలు.. ధర ఎంతంటే?

Palla Rajeshwar Reddy | 52 వేల కోట్ల బాకీ కట్టు.. రైతులకు కరెంటు ఇవ్వు

Teen Harassed By Group Of Men | బీహార్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై యువతిని చుట్టుముట్టి



