TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
TG SET 2026 | తెలంగాణలోని డిగ్రీ కళాశాలలు, వర్సిటీల్లో లెక్చరర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే 'టీజీ సెట్ 2026' ( TG SET 2026 )నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం( Osmania University ) విడుదల చేసింది.
TG SET 2026 | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఉద్దేశించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG-SET)-2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆగస్టు 3వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- దరఖాస్తుల స్వీకరణ - ఆగస్టు 3
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ - ఆగస్టు 30
- ఆలస్య రుసుం రూ. 1500 + రిజిస్ట్రేషన్ ఫీ - ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు
- ఆలస్య రుసుం రూ. 2000 + రిజిస్ట్రేషన్ ఫీ - సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10 వరకు
- ఆలస్య రుసుం రూ. 3000 + రిజిస్ట్రేషన్ ఫీ - సెప్టెంబర్ 11 నుంచి 12 వరకు
- ఎడిట్ ఆప్షన్స్ - సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు
- డౌన్ లోడ్ హాల్ టికెట్స్ - సెప్టెంబర్ 22
- టీజీ సెట్ ఎగ్జామ్ - సెప్టెంబర్ చివరి వారంలో
టీజీ సెట్ పరీక్షా విధానం ఇలా..
- టీజీ సెట్ పరీక్షను మొత్తం రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒకే విడతలో ఈ రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది.
- పేపర్-1: ఈ పేపర్‌లో అభ్యర్థుల జనరల్ అవేర్‌నెస్, టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఇందులో మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది.
- పేపర్-2: ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- ఈ రెండు పేపర్లను కలిపి రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల (180 నిమిషాలు) సమయం కేటాయించనున్నారు. పరీక్ష మధ్యలో ఎలాంటి విరామం ఉండదు.
- టీజీ సెట్ 2026 నోటిఫికేషన్, సిలబస్ తో పాటు పాటు ముఖ్యమైన అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..
- ●Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు
- ●Security Guard | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు
- ●Soaps | సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లపై ఇక ఆకుపచ్చ, ఎరుపు రంగు చుక్కలు.. కొత్త నిబంధనలు..
- ●RIMS Adilabad | నవజాత శిశువుల వార్డులో పేలిన ఏసీ.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల

Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..

Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు

Security Guard | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు






