Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..
Anthropic | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ఆంథ్రోపిక్ తన కొత్త ఏఐ మోడల్ క్లాడ్ ఓపస్ 5.5ను లాంచ్ చేసింది. చాలా రకాల పనుల్లో క్లాడ్ ఫేబుల్ 5.1 స్థాయి పనితీరును అందిస్తూనే, ఓపస్ 5తో పోలిస్తే దీన్ని నిర్వహించేందుకు 40 శాతం తక్కువ ఖర్చవుతుందని సంస్థ తెలిపింది.
Technology | Published On Sep 23, 2026, 12.58 pm IST
Anthropic | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ఆంథ్రోపిక్ తన కొత్త ఏఐ మోడల్ క్లాడ్ ఓపస్ 5.5ను లాంచ్ చేసింది. చాలా రకాల పనుల్లో క్లాడ్ ఫేబుల్ 5.1 స్థాయి పనితీరును అందిస్తూనే, ఓపస్ 5తో పోలిస్తే దీన్ని నిర్వహించేందుకు 40 శాతం తక్కువ ఖర్చవుతుందని సంస్థ తెలిపింది. అధునాతన కృత్రిమ మేధ అభివృద్ధిలో ఫ్రాంటియర్‌ను నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లాలనే విధానాన్ని ఆంథ్రోపిక్ ప్రకటించిన తర్వాత విడుదల చేసిన తొలి మోడల్ ఇదే. విడుదలకు ముందు క్లాడ్ ఓపస్ 5.5ను ఫ్రాంటియర్ డిజైన్, ఎంఈటీఆర్ సహా బాహ్య మూల్యాంకన సంస్థలు పరీక్షించినట్లు కంపెనీ వెల్లడించింది. తన ఆటోమేటెడ్ ప్రవర్తనా ఆడిట్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్‌ను ఓపస్ 5.5 సాధించిందని ఆంథ్రోపిక్ పేర్కొంది. ఈ పరీక్షను తమ అత్యంత సమగ్ర ఏఐ అనుసరణ పరీక్షగా సంస్థ అభివర్ణించింది. అత్యంత సామర్థ్యం కలిగిన మోడళ్ల కోసం రూపొందించిన భద్రతా చర్యలను కూడా ఓపస్ 5.5లో పొందుపరిచినట్లు తెలిపింది.
గత మోడల్స్‌లో పోలిస్తే గణనీయమైన మెరుగుదల..
ఓపస్ 5తో పోలిస్తే ఏఐ ఆధారిత కోడింగ్, కంప్యూటర్ వినియోగం, నాలెడ్జ్ వర్క్ వంటి విభాగాల్లో ఓపస్ 5.5లో గణనీయమైన మెరుగుదలలు ఉన్నాయని ఆంథ్రోపిక్ తెలిపింది. సాధారణ పనితీరు స్థాయిలోనే అధునాతన ఫలితాలను అందించడంతోపాటు, అత్యధిక సెట్టింగ్‌లలో పనిచేసే ఇతర మోడళ్లను కూడా కొన్ని సందర్భాల్లో అధిగమిస్తుందని కంపెనీ పేర్కొంది. సాధారణ పనుల్లో ఓపస్ 5తో పోలిస్తే ఓపస్ 5.5 నిర్వహణ ఖర్చు 40 శాతం తక్కువగా ఉంటుందని ఆంథ్రోపిక్ నిర్వహించిన పరీక్షల్లో తేలినట్లు తెలిపింది. అదే సమయంలో ఓపస్ 5.5, ఓపస్ 5 కంటే 30 శాతానికి పైగా వేగంగా ఫలితాలను రూపొందిస్తుందని వెల్లడించింది. వినియోగదారులతో మరింత సహజంగా సంభాషించేలా కూడా ఓపస్ 5.5ను రూపొందించినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఓపస్ 5పై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, సమాధానాల్లో అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ముందుగా అందించేలా, వినియోగదారులు సూచించిన రాత నియమాలను పాటించేలా మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. దీనివల్ల సుదీర్ఘ సంభాషణలను అనుసరించడం మరింత సులభమవుతుందని తెలిపింది.
పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు..
పరిశోధన, ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై కూడా ఆంథ్రోపిక్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఒక అంతర్గత పరీక్షలో ఒక కంపెనీ త్రైమాసిక పనితీరుపై నివేదిక రూపొందించాలని ఓపస్ 5.5, ఫేబుల్ 5.1, ఓపస్ 5 మోడళ్లను కోరారు. ఇందుకోసం ఆదాయ ప్రకటనను గుర్తించడం కష్టంగా ఉన్న వెబ్ ప్రతిని ఉపయోగించారు. తయారైన నివేదికల్లోని ప్రతి గణాంకం, ప్రతి వ్యాఖ్యను సంబంధిత మూలాలతో ఆటోమేటెడ్ గ్రేడర్ తనిఖీ చేసింది. వివిధ పనితీరు సెట్టింగ్‌లలో ఓపస్ 5.5 రూపొందించిన 18 నివేదికల్లో 16 నివేదికలు ఆంథ్రోపిక్ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను అందుకున్నాయని కంపెనీ తెలిపింది. మరోవైపు ఫేబుల్ 5.1, ఓపస్ 5 మాత్రం ఏ ప్రయత్నంలోనూ ఆ ప్రమాణాలను అందుకోలేదని ఆంథ్రోపిక్ పేర్కొంది. ప్రారంభ దశలో మోడల్‌ను పరీక్షించిన పెట్టుబడి సంస్థ వాలీ క్యాపిటల్ కూడా ఓపస్ 5.5 పనితీరుపై వివరాలు వెల్లడించింది. సంస్థ నిర్వహించిన మూల్యాంకన పరీక్షలను మోడల్ అత్యల్ప సెట్టింగ్‌లోనే ఎక్కువగా పరిష్కరించిందని తెలిపింది. అధిక సెట్టింగ్‌లలో పనితీరు మరింత మెరుగుపడడంతోపాటు, పరీక్షా సూచనల్లో ఉన్న ఒక తప్పును కూడా మోడల్ గుర్తించిందని ఆంథ్రోపిక్ వెల్లడించింది.
ఎవరికి అందుబాటులో..?
క్లాడ్ ఓపస్ 5.5 ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ సహా పలు ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ప్రొ, మాక్స్, టీమ్ ప్లాన్లలో ఐదు గంటల వినియోగ పరిమితులను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకు అవసరమైన సమయంలో ఉపయోగించుకునేలా రేట్ లిమిట్ రీసెట్‌ను దాచుకునే సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
సంబంధిత వార్తలు

Gemini | ఏఐతో పెను ముప్పు..? వెబ్సైట్లను హ్యాక్ చేసిన గూగుల్ జెమిని..
సెప్టెంబర్ 19, 2026

Anthropic | మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు ఆంథ్రోపిక్ పోటీ.. క్లాడ్లోనే డాక్యుమెంట్లు..
సెప్టెంబర్ 17, 2026

Oracle | ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే.. లేవగానే ఉద్యోగులకు పిడుగులాంటి వార్త చెప్పిన ఒరాకిల్
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు
- ●Security Guard | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు
- ●Soaps | సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లపై ఇక ఆకుపచ్చ, ఎరుపు రంగు చుక్కలు.. కొత్త నిబంధనలు..
- ●RIMS Adilabad | నవజాత శిశువుల వార్డులో పేలిన ఏసీ.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
- ●Nursing Student | సెలవులకు ఇంటికి వచ్చి.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి
- ●Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. జాగ్రత్త అంటున్న నిపుణులు..

Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు

Security Guard | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు

Soaps | సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లపై ఇక ఆకుపచ్చ, ఎరుపు రంగు చుక్కలు.. కొత్త నిబంధనలు..

RIMS Adilabad | నవజాత శిశువుల వార్డులో పేలిన ఏసీ.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య



