Pakistan drone | సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ కలకలం.. సైన్యం అలర్ట్
Pakistan drone | జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్ (Pakistan drone) కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. అనంతరం సరిహద్దుకు సమీపంలోని మంగళ్‌నార్-డబ్రోట్ వైపు కదిలింది. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ కదలికలతో సైన్యం అలర్ట్ అయ్యింది. జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.
Pakistan drone | త్రినేత్ర.న్యూస్ : జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద (LoC in Poonch) పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్ కొద్దిసేపు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మెంధర్ సెక్టార్‌లోని బాలాకోట్ (Balakote) ప్రాంతంలోని బెహ్రూటి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి 8:05 గంటల సమయంలో భద్రతా దళాలు అనుమానిత డ్రోన్‌ను గుర్తించారు.
కొంతసేపు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిన డ్రోన్.. అనంతరం సరిహద్దుకు సమీపంలోని మంగళ్‌నార్-డబ్రోట్ వైపు కదిలింది. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. అనుమానిత డ్రోన్ కదలికలతో సైనిక దళాలు అప్రమత్తమయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి నిఘాను పెంచారు. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ ఏదైనా అనుమానాస్పద వస్తువులను జారవిడిచిందా..? లేదా ఏమైనా తీసుకెళ్లిందా..? అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న సైన్యం
మరోవైపు అనుమానాస్పద కదలికలపై నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఉధంపూర్-కథువా అటవీ ప్రాంతంలోని పలు చోట్ల స్థానిక పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. కుబాన్, నగేన్, ఖత్రైల్, గోడు ఫలాల్, పదేతర్, చోర్ మొట్టు, కియా, ఖేబా, భేద్, మార్తా, జోఫర్ తదితర మారుమూల గ్రామాల్లో విస్తృతంగా తనఖీలు చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇద్దరు అనుమానిత సాయుధ వ్యక్తులు సంచరిస్తున్నట్లు గ్రామస్థుల నుంచి సమాచారం అందిన నేపథ్యంలో రాజౌరిలోని గైబాస్, మిథియాని, మొగ్లా, నార్లా ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పాక్ డ్రోన్‌పై కాల్పులు
కాగా, ఈ ఏడాది ఆరంభంలో జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద భారత గగనతలంపైకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను సైన్యం అడ్డుకుంది. మార్చి 1న దిగ్వార్ ప్రాంతంలోని ఒక ఫార్వర్డ్ పోస్ట్ సమీపంలో డ్రోన్‌ను గుర్తించిన భద్రతా దళాలు దానిపై కాల్పులు జరిపారు. అయితే, దాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. డ్రోన్ కాల్పుల నుంచి తప్పించుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు
పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని నాజిల్స్‌పై ప్రదర్శించాలి
మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి






