త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘ‌ట‌న‌.. విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్న లేడీ శ్రీ‌రామ్ క‌ళాశాల

Lady Shri Ram College | ఢిల్లీ పార్క్‌లో 17 ఏళ్ల బాలిక‌పై (minor girl) గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌తో లేడీ శ్రీ‌రామ్ క‌ళాశాల (Lady Shri Ram College) ఉలిక్కిప‌డింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి సాధార‌ణ త‌ర‌గ‌తుల‌ను ర‌ద్దు చేసి సెల‌వు ప్ర‌క‌టించిన క‌ళాశాల‌.. నేడు ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తోంది.

D

National | Published On Sep 23, 2026, 1.13 pm IST

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘ‌ట‌న‌.. విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్న లేడీ శ్రీ‌రామ్ క‌ళాశాల
Advertisement

Lady Shri Ram College | త్రినేత్ర న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో రెండు రోజుల క్రితం ఓ పార్క్‌లో 17 ఏళ్ల బాలిక‌పై (minor girl) ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. ఆస్థా కుంజ్ పార్కులో సోమ‌వారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో స‌మీపంలోని లేడీ శ్రీ‌రామ్ క‌ళాశాల (Lady Shri Ram College) ఉలిక్కిప‌డింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి సాధార‌ణ త‌ర‌గ‌తుల‌ను ర‌ద్దు చేసి సెల‌వు ప్ర‌క‌టించిన క‌ళాశాల‌.. నేడు ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తోంది. విద్యార్థినుల భ‌ద్ర‌తే త‌మ‌కు అత్యంత ప్రాధాన్య‌మ‌ని క‌ళాశాల యంత్రాంగం పేర్కొంది.

కల్కాజీ మందిర్ (Kalkaji Mandir) సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కు (Astha Kunj Park)లో త‌న స్నేహితుడితో ఉన్న 17 ఏళ్ల మైన‌ర్‌పై ముగ్గురు వ్య‌క్తులు పోలీసుల‌మ‌ని చెప్పి అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. ఈ కేసులో నిందితులైన ఆసిఫ్, హేమంత్, ముఖేష్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున లేడీ శ్రీరామ్ కళాశాల (LSR) వెనుక గేటుకు కేవలం 50 మీటర్ల దూరంలో ప్రధాన నిందితుడు ఆసిఫ్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులకు, నిందితుడికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. ఈ ఘ‌ట‌న స‌మీపంలో విద్యార్థినుల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌ల‌ను రేకెత్తించింది. తాజా ఘ‌ట‌న‌తో క‌ళాశాల‌కు వెళ్లేందుకు విద్యార్థులు సైతం ఒకింత భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే అప్ర‌మ‌త్త‌మైన క‌ళాశాల యాజ‌మాన్యం తాజా నిర్ణ‌యం తీసుకుంది.

Also Read..

స‌ర్‌పై ఈసీలో అంత‌ర్గ‌త విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణ‌యాల‌పై ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు అభ్యంతరాలు

2019 ఈస్టర్ ఆత్మాహుతి దాడుల కేసు.. 15 మందికి 200 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓప‌స్ 5.5.. గ‌త మోడ‌ల్స్ క‌న్నా 40 శాతం త‌క్కువ ఖ‌ర్చు..

Advertisement
Advertisement