త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Encounter | జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

Encounter | జ‌మ్ము క‌శ్మీర్ (Jammu And Kashmir)లోని ఉధంపూర్ (Udhampur)లో ఎన్‌కౌంట‌ర్ (Encounter) చోటు చేసుకుంది. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు (Terrorists) హ‌త‌మ‌య్యారు.

D

National | Published On Sep 17, 2026, 12.41 pm IST

Encounter | జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం
Advertisement

Encounter | త్రినేత్ర‌.న్యూస్ : జ‌మ్ము క‌శ్మీర్ (Jammu And Kashmir)లోని ఉధంపూర్ (Udhampur)లో ఎన్‌కౌంట‌ర్ (Encounter) చోటు చేసుకుంది. మ‌జ‌ల్టా ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల (Terrorists) మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.

ఆ ప్రాంతంలో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ అనుమానాస్ప‌ద క‌ద‌లిక‌ల‌పై భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. భద్రతా బలగాలు అక్కడ భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) చేపట్టాయి. బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఆర్మీ, సీఆర్పీఎఫ్ (CRPF), వైట్ నైట్ కార్ప్స్ (White Knight Corps), జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆప‌రేష‌న్ నిర్వ‌హించాయి. ఈ క్ర‌మంలో ఉగ్ర‌వాదుల‌కు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు వైట్ నైట్ కార్ప్స్ 'ఎక్స్' (X) వేదికగా వెల్లడించింది. మ‌రో ఉగ్ర‌వాది కోసం ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. ఘ‌ట‌నాస్థ‌లి వ‌ద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామ‌గ్రి స్వాధీనం చేసుకున్నారు.

Also Read..

దిశా శాలియ‌న్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగ‌ల్ నోటీసు

రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భార‌త్ ఏమ‌న్న‌దంటే..?

అసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఆక‌ట్టుకుంటున్న ఫీచ‌ర్లు.. ధ‌ర‌లు ఎంతంటే..?

Advertisement
Advertisement