Encounter | యూస్‌మార్గ్ ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ హతం
Encounter | జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా కమాండర్ (Lashkar commander) యాసిర్ (Yasir) హతమయ్యాడు.
Encounter | త్రినేత్ర.న్యూస్ : జమ్ము కశ్మీర్‌లోని (Jammu And Kashmir) బద్గామ్ జిల్లా (Budgam district) యూస్‌మార్గ్‌లో శనివారం ఎన్‌కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా కమాండర్ (Lashkar commander) యాసిర్ (Yasir) హతమయ్యాడు. యాసిర్ గతంలో లష్కరే తోయిబాకు చెందిన 'సులైమాన్ ముసా' (Sulaiman Musa) గ్రూప్‌లో కీలక సభ్యుడని భద్రతా వర్గాలు తెలిపాయి.
మూసా గ్రూపు నుంచి విడిపోయిన యాసిర్.. ఏడాదిగా ఈ ప్రాంతంలో లష్కరే కమాండర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా భద్రతా దళాలు అతడి కదలికలపై నిఘా ఉంచాయి. నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రతా బలగాలు యూస్‌మార్గ్ ఎన్‌క్లేవ్‌లోని ఎగువ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎదురు కాల్పుల్లో యాసిర్ హతమయ్యాడు. లష్కర్ ఉగ్రవాదులతో ఇతడికి ఉన్న సంబంధాలు, ఇటీవలే జమ్ము కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇతడి పాత్రపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరు ఈ సులైమాన్ మూసా?
సులైమాన్ మూసా (Sulaiman Musa)ని హాషిమ్ మూసా అని కూడా పిలుస్తారు. ఇతడు 2025 పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకడు. ఈ దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత శ్రీనగర్‌లోని దచ్చిగ్రామ్ అడవుల్లో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మూసా హతమయ్యాడు.
Also Read..
పాకిస్థాన్‌కు గట్టి షాక్.. సింధు నదిపై భారత్ తొలి రాక్ చెక్ డ్యామ్
భారీ జీతం లేకపోయినా సంపద పెంచుకోవచ్చు.. ఈ 5 అలవాట్లు ఉంటే చాలు..
ఇండియన్ సినిమా హిస్టరీలోనే లెంగ్తీ టైటిల్ ఇదే - ఆ నలుగురు డైరెక్టర్ కొత్త ప్రయోగం
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tollywood | ఇండియన్ సినిమా హిస్టరీలోనే లెంగ్తీ టైటిల్ ఇదే - ఆ నలుగురు డైరెక్టర్ కొత్త ప్రయోగం
- ●Wealth Building | భారీ జీతం లేకపోయినా సంపద పెంచుకోవచ్చు.. ఈ 5 అలవాట్లు ఉంటే చాలు..
- ●Jhiram Ghati Case | ఝీరం ఘాటి ఊచకోత కేసు.. పది మందిని దోషులగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు..!
- ●BC Caste Census | బీసీ కులగణనపై కాంగ్రెస్ 100 రోజుల ఉద్యమం
- ●Harish Rao Siddipet Speech | ఆరు గ్యారంటీలతో మోసం.. అసెంబ్లీలో గల్లా పట్టుకుని అడుగుతా
- ●Rock Check Dam | పాకిస్థాన్‌కు గట్టి షాక్.. సింధు నదిపై భారత్ తొలి రాక్ చెక్ డ్యామ్

Tollywood | ఇండియన్ సినిమా హిస్టరీలోనే లెంగ్తీ టైటిల్ ఇదే - ఆ నలుగురు డైరెక్టర్ కొత్త ప్రయోగం

Wealth Building | భారీ జీతం లేకపోయినా సంపద పెంచుకోవచ్చు.. ఈ 5 అలవాట్లు ఉంటే చాలు..

Jhiram Ghati Case | ఝీరం ఘాటి ఊచకోత కేసు.. పది మందిని దోషులగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు..!

BC Caste Census | బీసీ కులగణనపై కాంగ్రెస్ 100 రోజుల ఉద్యమం






