త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RIMS Adilabad | న‌వ‌జాత శిశువుల వార్డులో పేలిన ఏసీ.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య‌

RIMS Adilabad | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS Adilabad) ద‌వాఖాన‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం (Fire Accident) తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.

G

Telangana | Published On Sep 23, 2026, 11.45 am IST

RIMS Adilabad | న‌వ‌జాత శిశువుల వార్డులో పేలిన ఏసీ.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య‌
Advertisement

RIMS Adilabad | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS Adilabad) ద‌వాఖాన‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం (Fire Accident) తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. సోమ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో పిల్ల‌ల వార్డులో జ‌రిగిన ఈ దుర్ఘ‌ట‌నలో అమాయక పసికందులు ప్రాణాలు కోల్పోయారు. స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU)లో ఏసీ పేలుడుతో (AC Blast) మృతి చెందిన నవజాత శిశువుల సంఖ్య ఐదుకు చేరింది.

సోమ‌వారం అర్ధ‌రాత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో (Short Circuit) ఏసీ ఒక్కసారిగా పేలిపోయింది. నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ వార్డు అంతా కమ్మేసింది. దీంతో వార్డులో చికిత్స పొందుతున్న 27 మంది నవజాత శిశువుల్లో ఐదు రోజుల చిన్నారి (Infant) అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. మ‌రో ఇద్ద‌రు ప్రైవేటు ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌కు చెందిన దుర్గబాయి బిడ్డ రిమ్స్‌లో మృతి చెందగా, ఇంద్రవెల్లి మండలం దుబ్బగూడకు చెందిన నాగుబాయి బిడ్డను నిర్మల్‌కు తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. వారంతా రెండు, ఐదు, పదిహేను రోజుల వయసున్న పసికందులు కావ‌డం గ‌మ‌నార్హం. మృతులంతా ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాలకు చెందిన వార‌ని అధికారులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement