Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్ ధోరణిలో ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 24,000 మార్క్ సమీపంలో కొనసాగగా, ఐటీ, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు లాభపడగా, పీఎస్‌యూ బ్యాంకులు, కెమికల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్ ధోరణిలో ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 24,000 మార్క్ సమీపంలో కొనసాగగా, ఐటీ, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు లాభపడగా, పీఎస్‌యూ బ్యాంకులు, కెమికల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 76,820 వద్ద కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 0.10 శాతం స్వల్ప నష్టంతో 24,000 మార్క్‌కు దిగువన కొనసాగుతోంది. విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ 0.03 శాతం తగ్గగా, బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీ 0.19 శాతం క్షీణించింది. మార్కెట్ బ్రెడ్త్ ప్రతికూలంగా కనిపించింది. బీఎస్ఈలో 1,411 షేర్లు లాభపడగా, 1,544 షేర్లు నష్టపోయాయి. మరో 184 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
భారీగా క్షీణించిన భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు..
కాగా సోమవారం సెషన్ ముగిసే సమయానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.1,688.23 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.2,329.14 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తాత్కాలిక గణాంకాలు వెల్లడించాయి. క్వార్టర్ ఫలితాలు ప్రకటించిన భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్ 3.25 శాతం క్షీణించింది. కంపెనీ తొలి త్రైమాసికంలో సమీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 8.70 శాతం పెరిగి రూ.1,054.3 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.969.9 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 24.94 శాతం పెరిగి రూ.5,547 కోట్లకు చేరగా, గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ.4,439.7 కోట్లుగా నమోదైంది. మార్కెట్ సూచికల విషయానికి వస్తే భారత 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ యీల్డ్ 0.24 శాతం తగ్గి 6.757 వద్దకు చేరింది. గత ముగింపు సమయంలో ఇది 6.773గా ఉంది.
తగ్గిన చమురు ధరలు..
ఇక అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.56 శాతం తగ్గి బ్యారెల్‌కు 84 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.28 శాతం మేర తగ్గి బ్యారెల్‌కు 82 డాలర్ల వద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కాస్త బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.68 వద్ద ఉన్న రూపాయి సెషన్లో 21 పైసల మేర లాభపడింది.
సంబంధిత వార్తలు

Stock Markets | పెరిగిన టారిఫ్ భయాలు, ముడి చమురు ధరలు.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
నవంబర్ 27, 2026

Stock Markets | ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
నవంబర్ 27, 2026

Stock Markets | 10 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



