త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Security Guard | క్యాబ్ ఎక్కుతుండ‌గా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు

Security Guard | మ‌హిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) ప‌ట్ల ఓ సెక్యూరిటీగార్డు (Security Guard) అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆఫీస్‌కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతుండ‌గా ప‌క్కుకు గుంజి ఆమెకు ముద్దు పెట్టాడు.

G

Hyderabad | Published On Sep 23, 2026, 12.38 pm IST

Security Guard | క్యాబ్ ఎక్కుతుండ‌గా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు
Advertisement

Security Guard | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) ప‌ట్ల ఓ సెక్యూరిటీగార్డు (Security Guard) అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆఫీస్‌కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతుండ‌గా ప‌క్కుకు గుంజి ఆమెకు ముద్దు పెట్టాడు. అనంత‌రం అక్క‌డినుంచి ప‌రార‌య్యాడు.

విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఓ యువ‌తి (24) ఐటీ కారిడార్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న‌ది. గ‌చ్చిబౌలిలోని ఇందిరాన‌గ‌ర్‌లో (Indira Nagar) ఓ పీజీ హాస్ట‌ల్‌లో ఉంటున్న‌ది. రోజూలానే ఉద‌యం 10.30 గంట‌ల స‌మ‌యంలో హాస్ట‌ల్ నుంచి క్యాబ్‌లో ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధ‌మైంది. అయితే ఆమె కారు ఎక్కుతుండ‌గా.. అప్ప‌టికే అక్క‌డున్న ఓ వ్య‌క్తి ఆమెను ప‌క్క‌కు లాగాడు. బ‌లవంతంగా ముద్దుపెట్టాడు. ఆమె గ‌ట్టిగా అర‌వ‌డంతో అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. దీంతో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదుచేసిన పోలీసులు.. ద‌ర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన రాజ్ కుమార్ (25) అని, ఇందిరాన‌గ‌ర్‌లోని సంతోష్ దాబాలో సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్న‌ట్లు గుర్తించారు. అత‌డిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement