Arrest | అక్రమ గ్యాస్ సిలిండర్ల విక్రయ ముఠా అరెస్ట్
Arrest | బంజారాహిల్స్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల (Gas cylinders)ను నిల్వ ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తున్న 10 మంది వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి జరిపిన సంయుక్త దాడిలో మొత్తం 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
త్రినేత్ర.న్యూస్: బంజారాహిల్స్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల (Gas cylinders)ను నిల్వ ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తున్న 10 మంది వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి జరిపిన సంయుక్త దాడిలో మొత్తం 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు మొహమ్మద్ అమీర్, శంషాబాద్ కేంద్రంగా "మెట్రో గ్యాస్ ఏజెన్సీ" నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని ఒక స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ (Dumping) చేస్తున్నాడు. అక్కడి నుంచి తన సిబ్బంది సహాయంతో అవసరమున్న ఖాతాదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు గడిస్తున్నట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ చ. యదేందర్, ఎస్.ఐ డి. రవిరాజ్, వారి బృందం, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి ఈ దాడి నిర్వహించారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
ప్రధాన నిందితుడితో పాటు మొహమ్మద్ యూసుఫ్ (గ్యాస్ డెలివరీ బాయ్), మొహమ్మద్ ఇస్మాయిల్ (గ్యాస్ డెలివరీ బాయ్), ఎ. రామారావు (గ్యాస్ డెలివరీ బాయ్), లోక్ కుమార్, మొహమ్మద్ సక్రుద్దీన్, మొహమ్మద్ ముంతాజ్ అన్సారీ (డ్రైవర్), మొహమ్మద్ మినాజ్ అన్సారీ, రాజేష్ పాల్ (డ్రైవర్), రామ్ రాజ్ సింగ్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. 10 వాహనాలు సీజ్ చేసి, సుమారు 21,88,000 నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Gas Cylinders | భారీ వర్షం.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. షాకింగ్ వీడియో
జులై 9, 2026

Student Missing | చదువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత బస్సులో చక్కర్లు..
జులై 9, 2026

OU PhD Admissions | ఓయూ పీహెచ్డీ క్యాటగిరీ-1 ఫలితాలు వచ్చేశాయ్.. తదుపరి ప్రక్రియ ఇదే!
జులై 8, 2026
తాజావార్తలు
- ●BSNL | శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు ఎవరైనా కొనవచ్చు.. ధర ఎంతంటే..?
- ●Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్
- ●Meta Muse Image | మెటా మ్యూస్ ఇమేజ్ వచ్చేసింది.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో ఫొటోలకు కొత్త రూపం..
- ●Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి... పీసీసీ చీఫ్ మహేశ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
- ●Koppula Eshwar | తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణియే గుర్తించింది.. కాంగ్రెస్, బీజేపీలు గొప్పలు చెప్తుంటే నవ్వొస్తుంది
- ●Chamala Kiran Kumar Reddy | పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే.. ప్రజల్లో చులకనౌతాం: ఎంపీ చామల

BSNL | శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు ఎవరైనా కొనవచ్చు.. ధర ఎంతంటే..?

Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్

Meta Muse Image | మెటా మ్యూస్ ఇమేజ్ వచ్చేసింది.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో ఫొటోలకు కొత్త రూపం..

Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి... పీసీసీ చీఫ్ మహేశ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు



