త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi OTT | ఓటీటీలో రామ్‌చ‌ర‌ణ్ పెద్ది స్ట్రీమింగ్‌ – లిప్‌లాక్‌ల‌లో నో ఛేంజెస్ – కొత్త‌గా యాడ్ చేసిన సీన్లు ఏవంటే?

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ గురువారం (నేటి) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రిక‌ల్ వెర్ష‌న్‌తో పోలిస్తే ఓటీటీలో చాలానే మార్పులు చేశారు. కొన్ని కొత్త సీన్ల‌ను యాడ్ చేశారు. ర‌న్ టైమ్ కూడా త‌గ్గించారు.

N

Entertainment | Published On Jul 9, 2026, 10.38 am IST

Peddi OTT | ఓటీటీలో రామ్‌చ‌ర‌ణ్ పెద్ది స్ట్రీమింగ్‌ – లిప్‌లాక్‌ల‌లో నో ఛేంజెస్ – కొత్త‌గా  యాడ్ చేసిన సీన్లు ఏవంటే?
Advertisement

Peddi OTT |  రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజైంది. ఓటీటీలో విడుద‌లైన కొద్ది గంట‌ల్లోనే పెద్ది ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఫ‌స్ట్ ప్లేస్‌లో పెద్ది కొన‌సాగుతోంది.

లిప్‌లాక్‌లు య‌థాత‌థం...

కాగా ఓటీటీ వెర్ష‌న్ కోసం మేక‌ర్స్ సినిమాలో చాలానే మార్పులు చేశారు. కొత్త‌గా కొన్ని సీన్ల‌ను యాడ్ చేశారు. సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్‌ల‌పై వ‌చ్చే లిప్‌లాక్ సీన్ల‌ను ఓటీటీ వెర్ష‌న్ నుంచి డిలేట్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ మేక‌ర్స్ మాత్రం ముద్దు స‌న్నివేశాల్లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. కానీ వాటిని ఇంకాస్త రొమాంటిక్‌గా చూపించారు. లిప్‌లాక్ సీన్ల లెంగ్త్ పెంచారు. వాటి ప్లేస్‌మెంట్ కూడా మార్చేశారు.

పెళ్లి చూపుల సీన్‌...

జాన్వీ అందాల‌ను రామ్‌చ‌ర‌ణ్ వ‌ర్ణించే స‌న్నివేశాల్లో కెమెరా యాంగిల్స్ అభ్యంత‌ర‌క‌రంగా చూపించ‌డంపై చాలానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ క్లోజ‌ప్ షాట్స్ మొత్తం సినిమా నుంచి తొల‌గించారు. జాన్వీ పెళ్లి చూపులు సీన్‌తో పాటు మార్కెట్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం చేసే స‌న్నివేశాల నిడివి పెంచారు.

ర‌న్ టైమ్ త‌గ్గింపు...

క‌ప్పు గెలిచి రామ్‌చ‌ర‌ణ్ తిరిగి ఇంటికి వ‌చ్చే ఎపిసోడ్ థియేట‌ర్ల‌లో లాజిక్‌లెస్‌గా ఉందంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ సీన్‌లో ఛెంజేస్ చేశారు. కొత్త స‌న్నివేశాల‌ను యాడ్ చేసి ఎమోష‌న‌ల్‌గా ప్రీ క్లైమాక్స్‌ను డిజైన్ చేశారు. ర‌న్‌టైమ్ కూడా త‌గ్గించారు. థియేట‌ర్ల‌లో మూడు గంట‌ల తొమ్మిది నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ సినిమా రిలీజ్ కాగా...మూడు గంట‌ల ఐదు నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

జాన్వీ క‌పూర్ హీరోయిన్‌...

పెద్ది మూవీలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌గా... శృతి హాస‌న్ స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు. కాన్సెప్ట్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్‌కు మంచి పేరొచ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది....

 

Advertisement
Advertisement