Dangerous Stunts | ఎక్స్‌ప్రెస్‌వేపై ఎస్‌యూవీలతో ప్రమాదకర స్టంట్స్.. డోర్లు తెరిచి అతివేగంగా వెళ్తూ..
Dangerous Stunts | గురుగ్రామ్ (Gurugram)లో కొందరు తమ ఖరీదైన ఎస్‌యూవీ వాహనాలతో ప్రమాదకర స్టంట్స్ (Dangerous Stunts) చేశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (Dwarka Expressway)పై మూడు కార్లతో కొన్ని కిలోమీటర్ల మేర ప్రమాదకరంగా ప్రయాణించారు.
Dangerous Stunts | రీల్స్ పిచ్చితో కొందరు యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో హైలెట్ అవడానికి బైక్‌లు, కార్లతో ప్రమాదకర స్టంట్స్ (Dangerous Stunts) ప్రదర్శిస్తూ.. వాటిని రీల్స్‌గా చిత్రీకరించి నెట్టింట పోస్టు చేస్తున్నారు. ఇలా రీల్స్ చేసే క్రమంలో కొందరు రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ మనం ఇప్పటికే అనేకం చూశాం. అయినా జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు. ప్రమాదకరంగా ప్రయాణిస్తూ.. వారి ప్రాణాలతోపాటూ ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు.
తాజాగా గురుగ్రామ్ (Gurugram)లో కొందరు తమ ఖరీదైన ఎస్‌యూవీ వాహనాలతో ప్రమాదకర స్టంట్స్ (Dangerous Stunts) చేశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (Dwarka Expressway)పై మూడు కార్లతో కొన్ని కిలోమీటర్ల మేర ప్రమాదకరంగా ప్రయాణించారు. అతివేగంగా వెళ్లడం, జిగ్‌జాగ్‌గా కార్లను నడపడం, కారు డోర్లు తీసి ప్రమాదకరంగా ప్రయాణించడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వంటివి చేశారు. వీరి చర్యతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ వాహనాలను స్లోగా ముందుకు పోనిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. కార్ల నంబర్ ప్లేట్స్ ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వారు కావాలనే తమ కార్ల నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.
Also Read..
ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
తాజావార్తలు
- ●ChatGPT Work | చాట్ జీపీటీ వర్క్ మోడల్ వచ్చేసింది.. ఇక గంటల తరబడి ఏఐని వాడవచ్చు..
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ - నాలుగు భాషల్లో రిలీజ్
- ●Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్
- ●ITR Filing | ఐటీఆర్ రీఫండ్ ఇక వేగంగా.. 7-10 రోజుల్లోనే ఖాతాలో డబ్బు.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..
- ●Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ
- ●Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమవుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల

ChatGPT Work | చాట్ జీపీటీ వర్క్ మోడల్ వచ్చేసింది.. ఇక గంటల తరబడి ఏఐని వాడవచ్చు..

Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ - నాలుగు భాషల్లో రిలీజ్

Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్

ITR Filing | ఐటీఆర్ రీఫండ్ ఇక వేగంగా.. 7-10 రోజుల్లోనే ఖాతాలో డబ్బు.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..






