Sonam Wangchuk | రాజ్‌ఘాట్‌లో గాంధీకి సోనమ్ వాంగ్‌చుక్ నివాళి..
Sonam Wangchuk | లద్దాఖ్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మెరుగుపడింది. గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి సోమవారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
- ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ సందర్భంగా భావోద్వేగ సందేశం
Sonam Wangchuk | లద్దాఖ్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మెరుగుపడింది. గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి సోమవారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత లద్దాఖ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. డిశ్చార్జ్ తర్వాత ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందేశంలో వాంగ్‌చుక్ తన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. "చివరికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు వచ్చింది. ప్రస్తుతం నెమ్మదిగా ఆహారం తీసుకుంటున్నాను. శరీరానికి మళ్లీ శక్తి వస్తోంది. ఆరోగ్యం గతంతో పోలిస్తే చాలా మెరుగైంది. త్వరలో పూర్తిగా కోలుకుంటాననే నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు. లద్దాఖ్‌కు తిరిగి వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించడం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
#WATCH | Delhi | Activist Sonam Wangchuk, along with his wife Gitanjali Angmo, offers tributes at Rajghat, soon after getting discharged from Medanta Hospital in Gurugram. pic.twitter.com/voNfoVmsyD
— ANI (@ANI) July 27, 2026
ఉద్యమానికి దేశవ్యాప్తంగా లభించిన మద్దతుపై వాంగ్‌చుక్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు గొంతెత్తి ఉద్యమానికి అండగా నిలవడంతోనే ఈ పోరాటం విజయవంతమైందని అన్నారు. "మనమంతా కలిసి విజయం సాధించాం. ఇది ఒక్కరి విజయం కాదు.. అందరి కృషికి దక్కిన ఫలితం" అని పేర్కొన్నారు. తనకు చికిత్స అందించిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తన కోలుకోవడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు తెలిపిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు ఐక్యంగా నిలిచి ఉద్యమానికి మద్దతు ఇవ్వడం వల్లే ఈ ఉద్యమం బలపడిందని వాంగ్‌చుక్ అన్నారు. ఈ విజయాన్ని ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నానని చెప్పారు. ప్రజల సంఘీభావం, మద్దతు తనకు మరింత ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా లద్దాఖ్ ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు.
#WATCH गुरुग्राम, हरियाणा: मेदांता अस्पताल से एक वीडियो संदेश में एक्टिविस्ट सोनम वांगचुक ने कहा, "आखिरकार वह दिन आ ही गया जब मुझे इस अस्पताल से छुट्टी मिल रही है। मैं अब काफी बेहतर महसूस कर रहा हूं। धीरे-धीरे खाना खा रहा हूं और शरीर में ताकत वापस आ रही है। यहां से निकलने के बाद… pic.twitter.com/trBdpRZnpk
— ANI_HindiNews (@AHindinews) July 27, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..
- ●Nitin Gadkari | E20 వివాదం.. కోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ
- ●Dhanush | పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ధనుష్? - సీఎం విజయ్‌కి పోటీగా ఎన్నికల బరిలో...
- ●MP Lakshman | రేవంత్‌ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?
- ●Bhatti Vikramarka | ఉచితాలు కావు... ప్రజా పెట్టుబడులు
- ●Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!

vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..

Nitin Gadkari | E20 వివాదం.. కోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ

Dhanush | పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ధనుష్? - సీఎం విజయ్‌కి పోటీగా ఎన్నికల బరిలో...

MP Lakshman | రేవంత్‌ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?






