త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganesh Immersion | గణేశ్‌ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నిఘా

Ganesh Immersion | గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా సోషల్‌ మీడియాలో ప్రమాదకర విన్యాసాల వీడియోలను పోస్టు చేస్తున్న వారిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్‌ సీపీ, అడిషనల్‌ సీపీ (క్రైమ్స్‌) ఆదేశాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో జరుగుతున్న కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

P

Hyderabad | Published On Sep 23, 2026, 8.47 pm IST

Ganesh Immersion | గణేశ్‌ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నిఘా
Advertisement

Ganesh Immersion | గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా సోషల్‌ మీడియాలో ప్రమాదకర విన్యాసాల వీడియోలను పోస్టు చేస్తున్న వారిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్‌ సీపీ, అడిషనల్‌ సీపీ (క్రైమ్స్‌) ఆదేశాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో జరుగుతున్న కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, భద్రతకు ముప్పు కలిగించేలా విన్యాసాలు చేసిన ఘటనలకు సంబంధించి బుధవారం నాలుగు కేసులు నమోదు చేశారు. నిమజ్జన ఊరేగింపులో కదులుతున్న టస్కర్‌/ట్రక్‌ కింద వేలాడుతూ ఓ వ్యక్తి ప్రమాదకర విన్యాసాలు చేసిన ఘటనను పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో కదులుతున్న వాహనంపై తలపై గ్లాస్‌ పెట్టుకుని ఓ వ్యక్తి డ్యాన్స్‌ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది.

అలాగే గణేశ్‌ శోభాయాత్రలో కదులుతున్న వాహనం అంచున, పైన మైనర్లు ప్రమాదకరంగా డ్యాన్స్‌ చేసిన ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బహిరంగ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ప్రమాదకరంగా నడుపుతూ.. వెనుక కూర్చున్న వ్యక్తి పెద్ద గొరిల్లా కాస్ట్యూమ్‌ ధరించి ప్రజలతో అల్లరి చేసిన ఘటనపైనా చర్యలు చేపట్టారు. సోషల్‌ మీడియాలో వ్యూస్‌, లైక్స్‌, ఎంగేజ్‌మెంట్‌ కోసం ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం, ఇతరులను ప్రోత్సహించడం, వాటిని అనుకరించడం చేయొద్దని హైదరాబాద్‌ పోలీసులు సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. పోలీసుల సూచనలు పాటిస్తూ గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు సురక్షితంగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement