BRS USA | బండి సంజయ్ రాజీనామా చేయాలి : బీఆర్ఎస్ యూఎస్ఏ
BRS USA | తన కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసుకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ యూఎస్ఏ నాయకుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
brsunitedstatesofamerica
BRS USA | త్రినేత్ర.న్యూస్ : తన కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసుకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ యూఎస్ఏ నాయకుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ యూఎస్ఏ నాయకులు, కార్యకర్తలు అత్యవసరంగా ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఒక మైనర్ బాలికకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసులో నిందితుడు రోజుల తరబడి పరారీలో ఉండటం, ఆ తర్వాత అతడు స్వయంగా లొంగిపోయాడా? లేక పోలీసులు అరెస్టు చేశారా? అన్న విషయంపై కూడా స్పష్టత లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు అని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
దేశానికి చట్టాల గురించి ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఉన్న నాయకుడి కుటుంబ సభ్యుల పేరు ఇలాంటి వివాదాల్లో రావడం చాలా దురదృష్టకరం. బాధితురాలికి న్యాయం జరిగేలా, విచారణ నిష్పక్షపాతంగా సాగాలంటే బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళల భద్రత, మైనర్ బాలికల రక్షణ అంశాల్లో రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపించారు.
సాధారణ ప్రజలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు 24 గంటల్లో చర్యలు తీసుకుంటారు. కానీ రాజకీయ ప్రభావం ఉన్నప్పుడు విచారణలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనపై బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండగా, సోషల్ మీడియాలో “హైబ్రిడ్ అరెస్టు”, “హైబ్రిడ్ న్యాయం” అనే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయన్నారు.
అమెరికాలోని అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, ఫీనిక్స్, ఫిలడెల్ఫియా, సాన్ ఆంటోనియో, సాన్ డియాగో, Connecticut, Boston, Columbus, Delaware, Virginia తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 1,000 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్న ఆన్‌లైన్ సమావేశంలో ఈ డిమాండ్‌ను ఏకగ్రీవంగా వ్యక్తం చేసినట్లు BRS USA ప్రతినిధులు తెలిపారు.
“బాధితురాలికి న్యాయం జరగాలి… చట్టం అందరికీ సమానంగా ఉండాలి… రాజకీయ ప్రభావంతో నిజాలు మసకబారకూడదు” అని సమావేశంలో పాల్గొన్న ఎన్నారై నాయకులు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Mahesh Kumar Goud | హరీశ్‌రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్
జులై 10, 2026

Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
జులై 10, 2026

Medipally Satyam | అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే.. ఆయనకు రేవంత్ ఫోబియా పట్టుకుంది
జులై 10, 2026
తాజావార్తలు
- ●Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష
- ●Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
- ●Lenin Review | లెనిన్ రివ్యూ - అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?
- ●MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్
- ●Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవచ్చా.. రూల్స్ ఎలా ఉన్నాయి..
- ●CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్

Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష

Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర

Lenin Review | లెనిన్ రివ్యూ - అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?

MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్



