AIADMK MLAs resign | ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా.. టీవీకేలో చేరిక
AIADMK MLAs resign | అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు (AIADMK MLAs resign). ఆ తర్వాత వెంటనే వారు టీవీకే (TVK) మంత్రి ఆదవ్ అర్జునను కలిసి ఆ పార్టీలో చేరారు.
AIADMK MLAs resign | తమిళనాడు రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై అంతర్గత కలహాలతో సతమతమవుతున్న అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు (AIADMK MLAs resign). సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చెన్నై సచివాలయంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.
రాజీనామా చేసిన వారిలో మదురాంతకం నియోజకవర్గం నుంచి గెలిచిన మరగాథం , ధారాపురం నుంచి గెలిచిన సత్యభామ, పెరుందురై నుంచి ఎన్నికైన జయకుమార్ ఉన్నారు. ఆ తర్వాత వెంటనే వారు టీవీకే (TVK) మంత్రి ఆదవ్ అర్జునను కలిసి ఆ పార్టీలో చేరారు. కాగా, ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. దీంతో ఏఐఏడీంఎకే రెండుగా చీలిపోయింది. ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఇప్పుడు రాజీనామా చేసిన నేతలు కూడా ఉన్నారు. వీరి రాజీనామాతో మదురాంతకం, ధారాపురం, పెరుందురై అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. మళ్లీ అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
Also Read..
మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలుపాలన్నదే ప్రభుత్వ సంకల్పం : సీఎం రేవంత్
అప్పుడు సమంత మూవీతో హీరోగా ఎంట్రీ.. ఇప్పుడు సమంత సినిమాతోనే బాక్సాఫీస్ ఫైట్!
సంబంధిత వార్తలు

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 21, 2026

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
సెప్టెంబర్ 10, 2026

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



