CM Revanth Reddy | మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలుపాలన్నదే ప్రభుత్వ సంకల్పం : సీఎం రేవంత్
CM Revanth Reddy | మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందు కోసం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల అభివృద్ధి, ప్రగతికి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సచివాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్రవ్యాప్తంగా 8వేల స్వయం సహాయక బృందాల (SHG) గ్రామ సంఘ భవనాలకు శంకుస్థాపన, ఇందిరమ్మ చీరలు కొత్త డిజైన్ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
CM Revanth Reddy | మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందు కోసం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల అభివృద్ధి, ప్రగతికి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సచివాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్రవ్యాప్తంగా 8వేల స్వయం సహాయక బృందాల (SHG) గ్రామ సంఘ భవనాలకు శంకుస్థాపన, ఇందిరమ్మ చీరలు కొత్త డిజైన్ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే రోజు, ఒకే సమయానికి 8 వేల భవనాలను ప్రారంభించడం దేశంలోనే ప్రత్యేక ఘట్టమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలు తమ సొంత భవనాల నుంచే వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశం కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలంగా నిలబెడుతున్నామన్నారు. తెలంగాణ మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
కుట్రలను ఛేదించి..
డిసెంబర్ 2023లో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలు చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఇప్పటివరకు సుమారు 29 నెలల్లో రూ.10 వేల కోట్లకుపైగా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి మార్గమని స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంపై వచ్చిన విమర్శలను, అడ్డుకునేందుకు చేసిన కుట్రలను ప్రభుత్వం తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. మహిళల కోసం తీసుకున్న సంక్షేమ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోలేదని అన్నారు. అంతేకాదు, మహిళలను బస్సుల యజమానులుగా మార్చే దిశగా కొత్త ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. వెయ్యి బస్సులను మహిళా సంఘాలే కొనుగోలు చేసి, వాటిని ఆర్టీసీకి నెలవారీ రెంట్‌కు ఇవ్వాలనే ప్రణాళికను రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా 553 బస్సులను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి మండలానికి ఒక బస్సు అందేలా కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అదానీలు, అంబానీలు చేసే వ్యాపారంలోకి..
సోలార్ రంగంలోనూ మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని సీఎం పేర్కొన్నారు. అంబానీలు, అదానీలు, పెద్ద బడా కంపెనీలు ఆధిపత్యంలో ఉన్న ఈ రంగంలో మహిళా సంఘాలు కూడా పోటీ పడే స్థాయికి తీసుకెళ్తున్నామని అన్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు మహిళలకు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పెట్రోల్ బంకుల నిర్వహణలోనూ మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం మహిళా సంఘాలు నెలకు రూ.4–5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో మరిన్ని పెట్రోల్ బంకులకు స్థలాలు కేటాయించి ఈ రంగాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు.
రూ.10లక్షలకు బ్యాంకు లింకేజీ రుణాలు..
బ్యాంక్ లింకేజీలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు సీఎం తెలిపారు. ఇప్పటివరకు రూ.60,472 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందించామని వెల్లడించారు. జీరో వడ్డీ పథకానికి ప్రభుత్వం రూ.13,097 కోట్లను బ్యాంకులకు చెల్లించినట్లు చెప్పారు. నిర్మల్ జిల్లా ఈ పథకంలో ముందంజలో ఉందని అభినందించారు. “పెద్ద సంస్థలు రుణాలు తీసుకుని దేశాన్ని వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ, మహిళలు తీసుకున్న ప్రతి రూపాయిని తిరిగి చెల్లిస్తూ విజయగాధలు రాస్తున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా శక్తి ద్వారానే తెలంగాణ ఆర్థికంగా మరింత బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!




