Nirmala Sitharaman | దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం తగదు : నిర్మలమ్మ
Nirmala Sitharaman | ఇంధనంతో పాటు ఎరువుల ధరలు (Fertiliser prices) కూడా ఊహించని స్థాయికి పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. అదేసమయంలో బంగారం ధరలు పెరగడం కూడా సవాలుగా మారిందని చెప్పారు. ప్రస్తుత సవాళ్లు అన్నీ అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వచ్చినవేనని, దేశీయంగా ఆర్థిక పరిస్థితి సానుకూలంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Nirmala Sitharaman | పెట్రోల్, డీజిల్ ధరలు పదిరోజుల్లోనే నాలుగోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. ఇంధనంతో పాటు ఎరువుల ధరలు (Fertiliser prices) కూడా ఊహించని స్థాయికి పెరిగాయని అన్నారు. అదేసమయంలో బంగారం ధరలు పెరగడం కూడా సవాలుగా మారిందని చెప్పారు. ఈ మూడింటికీ డాలర్ల రూపంలో చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు. అందుకే విదేశీ మారకం తరిగిపోకుండా ఈ మూడింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ముంబైలో జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత సవాళ్లు అన్నీ అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వచ్చినవేనని, దేశీయంగా ఆర్థిక పరిస్థితి సానుకూలంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బయటి సంక్షోభాలను తట్టుకునేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. దేశీయంగా వృద్ధికి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతోనే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైంజ్ సుంకాలను తగ్గించామని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నామని చెప్పారు.
అంతర్జాతీయ సవాళ్ల నేపథ్యంలో 3 ఎఫ్‌లపై (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్) ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పౌరులకు సూచించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వివరించారు. అయితే, కొందరు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కోబోతోందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు బాహ్య కారకాలే కారణమన్న సంగతి విస్మరించొద్దంటూ ప్రతిపక్ష నేతలను పరోక్షంగా హెచ్చరించారు.
దేశ ఆర్థిక పరిస్థితి నేటికీ సానుకూలంగా, పటిష్టంగా ఉందని సీతారామన్ పునరుద్ఘాటించారు. సామాన్య ప్రజలు సాధిస్తున్న విజయాలను మరిచిపోయి, కేవలం నెగటివిటీని ప్రచారం చేయడం సరికాదన్నారు. మన దేశం ఇలాంటి భయానక ప్రచారాలను భరించలేదని, మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
Also Read..
ఎండ తీవ్రత ఎక్కువ ఉంటే ఇంట్లో ఉన్నా జాగ్రత్త పడాల్సిందే.. వైద్యుల హెచ్చరికలు..
కాంట్రాక్టర్ నుంచి రూ.50వేల డిమాండ్.. డీఈని వలేసి పట్టుకున్న ఏసీబీ..!
స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. యుద్ధం ముగింపుపై పెట్టుబడిదారుల ఆశావాదం..
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం






