Tollywood | అప్పుడు సమంత మూవీతో హీరోగా ఎంట్రీ.. ఇప్పుడు సమంత సినిమాతోనే బాక్సాఫీస్ ఫైట్!
హీరోయిన్ సమంత నిర్మించిన శుభం మూవీతోనే హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు హర్షిత్ రెడ్డి. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ మంచి హిట్టుగా నిలిచింది. శుభం తర్వాత వన్ సైడ్ లవ్‌స్టోరీతో దీవాన సినిమా చేస్తోన్నాడు హర్షిత్ రెడ్డి. సమంత మా ఇంటి బంగారం మూవీకి పోటీగా దీవాన థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On May 25, 2026, 5.11 pm IST
Tollywood | శుభం సినిమాతో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకున్నాడు హర్షిత్ రెడ్డి. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు హీరోయిన్ సమంత ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. శుభం మూవీతోనే హీరోగా ఫస్ట్ టైమ్ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాడు హర్షిత్ రెడ్డి. శుభం తర్వాత ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీవాన పేరుతో రూపొందిన ఈ సినిమాలో స్నేహ మణిమేఘలై హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
జూన్ 19న రిలీజ్...
దీవాన రిలీజ్ డేట్‌ను మేకర్స్ సోమవారం కన్ఫామ్ చేశారు. జూన్ 19న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. అదే రోజు సమంత హీరోయిన్‌గా నటించిన మా ఇంటి బంగారం రిలీజ్ అవుతోంది. సమంత నిర్మించిన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రెడ్డి...ఇప్పుడు ఆమె సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతుండటం ఆసక్తికరంగా మారింది.
వన్ సైడ్ లవ్‌స్టోరీ...
వన్ సైడ్ లవ్‌స్టోరీగా దీవాన తెరకెక్కుతోన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు ఈశ్వర్ చంద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటవలే దీవాన మూవీ నుంచి సింగర్ కార్తీక్ ఆలపించిన ప్రేమ..ఓ ప్రేమా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట పెద్ద హిట్టయ్యింది.
ఓటీటీ మూవీతో...
ఓటీటీ మూవీ మెయిల్‌తో హర్షిత్ రెడ్డి యాక్టింగ్ జర్నీ మొదలైంది. తరగతి గది దాటి, అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్‌సిరీస్‌లలో నటించాడు. ప్రభాస్ కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించాడు.
మరోవైపు జూన్ 19న దళపతి విజయ్ చివరి మూవీ జననాయగన్ కూడా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జననాయగన్ థియేటర్లలోకి వస్తే సమంత మా ఇంటి బంగారం రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు
సెప్టెంబర్ 21, 2026

Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మహానటి రెండు సినిమాలు రిలీజ్
సెప్టెంబర్ 20, 2026

Shruthi Haasan | హాలీవుడ్ సినిమాలో శృతి హసన్ – సమంత ఛాన్స్ కొట్టేసిన కమల్ తనయ
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



