BTech gold medallist | 50 సార్లు ఉద్యోగ ప్రయత్నం విఫలం.. సూసైడ్ చేసుకున్న గోల్డ్‌మెడలిస్ట్
BTech gold medallist | ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో విఫలమైన ఓ గోల్డ్‌మెడలిస్ట్ విద్యార్థి (BTech gold medallist).. బలవన్మరణానికి పాల్పడ్డాడు.
BTech gold medallist | అతడో బీటెక్ గోల్డ్‌మెడలిస్ట్ (BTech gold medallist).. దాదాపు 50 సార్లు ప్రభుత్వ ఉద్యోగం (government job) కోసం ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తీవ్ర నిరాశ చెందిన సదరు విద్యార్థి.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి (suicide) పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ (Kanpur)లో చోటు చేసుకుంది.
కాన్పూర్‌లోని గోవింద్ నగర్‌లోని గుజైని ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఆనంద్ కుమార్.. ప్రణవీర్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివాడు. 2024లో అతడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో టాపర్‌గా నిలవడమే కాకుండా.. ఉత్తరప్రదేశ్‌లోనే మూడవ ర్యాంకు సాధించాడు. 2024 ఆగస్ట్ 13న జరిగిన కార్యక్రమం ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
బీటెక్ తర్వాత ఆనంద్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ రాశాడు. రైల్వేలు, SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్), బ్యాంకులు, విద్యాశాఖ నిర్వహించిన దాదాపు 50కిపైగా పరీక్షల్లో పోటీ పడ్డాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గోల్డ్‌మెడలిస్ట్ అయిన ఆనంద్ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన పనిమనిషి తలుపు కొట్టగా లోపలినుంచి ఎంతకీ డోర్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. ఆనంద్ ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆనంద్ గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. "నన్ను క్షమించండి నాన్నా. ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. కానీ విజయం సాధించలేకపోయాను" అని అందులో రాసి ఉంది. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read..
10 ఏళ్లు నివాసముంటేనే హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు.. అర్హతలు ఇవే..!
బాలయ్య సినిమాలో విలన్ - సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ సరికొత్త అవతారం?
రూ.5,999కే హోమ్ థియేటర్.. పోర్ట్రోనిక్స్ నుంచి ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2..
సంబంధిత వార్తలు

Suicide Attempt | ప్రభుత్వానికి సూసైడ్ నోట్.. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం
ఆగస్టు 2, 2026

Special Trains | ఆగస్టులో కాచిగూడ-తిరుచానూరు మధ్య.. వరంగల్ మీదుగా కాన్పూర్-మధురై ప్రత్యేక రైళ్లు
జులై 30, 2026

Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు
జులై 28, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?
- ●Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ
- ●VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్
- ●Ponnam Prabhakar | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Infosys | ఐటీ పరిశ్రమల శ్రమదోపిడీ.. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీగా ఫైన్

RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?

Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ

VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్



