Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు
Rajasthan High Court | విద్యార్థులను (students) ఉపాధ్యాయులు (teachers) మందలించడం ఆత్మహత్యలకు ప్రేరేపించడం కాదని రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) స్పష్టం చేసింది.
Rajasthan High Court | విద్యార్థులను (students) ఉపాధ్యాయులు (teachers) మందలించడం ఆత్మహత్యలకు ప్రేరేపించడం కాదని రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) స్పష్టం చేసింది. టీచర్ మందలించినందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ టీచర్‌ను శిక్షించలేమని తెలిపింది. ఈ మేరకు టీచర్ తిట్టిందని చెప్పి 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో ఉపాధ్యాయులపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది.
12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయులు తమ కుమార్తెను వేధించారని.. మనస్తాపంతో సూసైడ్ చేసుకుందని సదరు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయులపై సెక్షన్ 305 కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా.. విద్యార్థిని క్లాసెస్‌కు సరిగా అటెండ్ కావడం లేదని, సరిగా చదవడం లేదని ఉపాధ్యాయులు మందలించినట్లు తేలింది. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కుల్దీప్ మాథుర్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య సంబంధం క్రమశిక్షణ, మార్గదర్శకత్వం, విద్యాపరమైన పర్యవేక్షణపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. విద్యార్థులకు విద్యా బుద్ధులతోపాటూ క్రమశిక్షణ నేర్పించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని స్పష్టం చేసింది. క్లాసెస్‌కు సరిగా అటెండ్ కాకపోవడం, చదువుల్లో వెనుకబడటంపై విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చిచెప్పింది.
క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లు కాదని తెలిపింది. ఈ కేసులో బాధితురాలిని ఉపాధ్యాయులు ఉద్దేశపూర్వకంగా శిక్షించినట్టు ఎటువంటి ఆధారాలూ లేవని స్పష్టం చేసింది. సాధారణ విద్యా వ్యవహారాల్లో భాగంగా మదలించడం ఆత్మహత్యకు పురికొల్పినట్టుగా భావించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 305 కింద ఉపాధ్యాయులపై మోపిన అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది.
Also Read..
భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..
కాజల్‌కు అచ్చిరాని బాలీవుడ్ - చందమామ ఖాతాలో మరో డిజాస్టర్
ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..
తాజావార్తలు
- ●Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..
- ●PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి
- ●X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..
- ●Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత
- ●KP Vivekananda | తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే.. పది తలల రావణుడు రేవంత్ రెడ్డి
- ●Heavy Rains | మెదక్ జిల్లాలో భారీ వర్షాలు.. పాపన్నపేట్‌లో అత్యధికంగా 84.5 మి.మీ. వర్షపాతం నమోదు

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..

PoK Violence | అట్టుడుకుతున్న పీవోకే.. పోలీసుల కాల్పుల్లో 20 మంది మృతి

X Money | ఎలాన్ మస్క్ ఎక్స్ (X) నుంచి ఇక బ్యాంకింగ్ సేవలు.. ఎక్స్ మనీ లాంచ్.. డిజిటల్ బ్యాంకింగ్, 6 శాతం వడ్డీ..

Telugu OTT | లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - మహేష్‌బాబు నిర్మాత






