త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aishwarya Rajesh | బాలయ్య సినిమాలో విల‌న్ – సంక్రాంతికి వ‌స్తున్నాం హీరోయిన్ స‌రికొత్త అవ‌తారం?

అచ్చ తెలుగు మూవీ బ్యూటీ ఐశ్వ‌ర్య రాజేష్ విల‌న్‌గా ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టేందుకు రెడీ అవుతోంది. బాల‌కృష్ణ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో ఐశ్వ‌ర్య రాజేష్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇటీవ‌లే ఈ సినిమా అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది.

N

Entertainment | Published On Jul 20, 2026, 4.44 pm IST

Aishwarya Rajesh | బాలయ్య సినిమాలో విల‌న్ – సంక్రాంతికి వ‌స్తున్నాం హీరోయిన్ స‌రికొత్త అవ‌తారం?
Advertisement

Aishwarya Rajesh |  ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని అంటుంటారు. కానీ అచ్చ తెలుగు అమ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ మాత్రం కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న త‌ర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ క‌థ‌లు, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫ‌స్ట్ టైమ్ తెలుగులో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

112వ మూవీ...

బాల‌కృష్ణ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ రాబోతుంది. ఇటీవ‌లే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. బాల‌కృష్ణ హీరోగా న టిస్తున్న 112వ సినిమా ఇది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది.

నెగెటివ్ షేడ్స్‌...

కాగా ఈ సినిమాలో సంక్రాంతికి వ‌స్తున్నాం హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేష్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. హీరోగా ధీటుగా సాగే పాత్ర కోసం ఐశ్వ‌ర్య రాజేష్‌ను డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అప్రోచ్ అయ్యార‌ట‌. పాత్ర‌లోని వేరియేష‌న్స్‌, స్కోప్ న‌చ్చ‌డంతో ఈ అచ్చ తెలుగు బ్యూటీ ఈ మూవీని అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.

కార్పెంట‌ర్‌...

ఐశ్వ‌ర్య రాజేష్ విల‌న్ పాత్ర చేయ‌బోతున్న ఫ‌స్ట్ తెలుగు మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవ‌ర త‌ర్వాత కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాకు కార్పెంట‌ర్ అనే వెరైటీ టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఓ సుకుమారి....

ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన ఓ సుకుమారి మూవీ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో తిరువీర్ హీరోగా న‌టించాడు. గ‌త వారం రిలీజైన తెలుగు సినిమాల్లో ఓ సుకుమారి డీసెంట్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. ఈ నెల‌లోనే ఓ సుకుమారితో పాటు ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించిన‌ ఇస‌క‌ప‌ట్నం వెబ్‌సిరీస్ కూడా రిలీజైంది.

 

Advertisement
Advertisement