Special Trains | ఆగస్టులో కాచిగూడ-తిరుచానూరు మధ్య.. వరంగల్ మీదుగా కాన్పూర్-మధురై ప్రత్యేక రైళ్లు
Special Trains | పండుగలు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. అదేవిధంగా కాన్పూర్-మధురై మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను వరంగల్ (Warangal) మీదుగా నడుపనున్నట్లు తెలిపింది.
Special Trains | త్రినేత్ర.న్యూస్: పండుగలు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ-తిరుచానూరు మార్గంలో ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. అదేవిధంగా కాన్పూర్-మధురై మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను వరంగల్ (Warangal) మీదుగా నడుపనున్నట్లు తెలిపింది. ఆగస్టు నెలలో కాచిగూడ, తిరుచానూరు (Kacheguda-Tiruchanur) మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 13న కాచిగూడ నుంచి తిరుచానూరుకు (రైలు నంబర్ 07787), ఆగస్టు 14న తిరుచానురు నుంచి కాచిగూడకు (నంబర్ 07788) ప్రత్యేకరైళ్లు బయల్దేరుతాయని చెప్పారు. ఈ రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.
అదేవిధంగా ఆగస్టు నెలలో వరంగల్ మీదుగా కాన్పూర్-మధురై (Kanpur-Madurai) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పారు. కాన్పూర్ సెంట్రల్- మధురై ప్రత్యేక రైళ్లు (01925) ఆగస్టు 5, 12, 19, 26 తేదీలలో (ప్రతీ బుధవారం) ఉదయం 8.10 గంటలకు కాన్పూర్ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 7.15 గంటలకు మధురై చేరుకుంటాయన్నారు.
ఇక మధురై- కాన్పూర్ సెంట్రల్ (01926) ప్రత్యేక రైళ్లు ఆగస్టు 8, 15, 22, 29 తేదీల్లో (ప్రతీ శనివారం) తెల్లవారు జామున 2.30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు మధురై చేరుకుంటాయని తెలిపారు. ఈ రైళ్లు నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్ష, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం రైల్వేస్టేషన్లలో ఆగుతాయన్నారు. ఇందులో సెకండ్ ఎసీ, థర్డ్ ఎసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?
సెప్టెంబర్ 20, 2026

Special Trains | పండుగలకు ఊరెళ్తున్నారా..? చర్లపల్లి–నాగర్‌కోయిల్ మధ్య ఐదు ప్రత్యేక రైళ్లు..!
సెప్టెంబర్ 19, 2026

Special Trains | పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం



