VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్
VC Sajjanar | ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (VC Sajjanar) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali) అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం (Bonalu) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
VC Sajjanar | త్రినేత్ర.న్యూస్: ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (VC Sajjanar) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali) అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం (Bonalu) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల పండుగకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందన్నారు. నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగిశాయని, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali Bonalu) , లాల్‌దర్వాజా అమ్మవార్ల (Lal Darwaza Bonalu) ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్ (Crowd management) నిఘా వ్యవస్థను మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేశామన్నారు. ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ ద్వారా ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే 'ఫేషియల్ రికగ్నిషన్' సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. దీనివల్ల పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను తక్షణమే గుర్తించి అప్రమత్తమయ్యే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.

ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్‌మెంట్ ద్వారా కచ్చితంగా లెక్కిస్తామని పేర్కొన్నారు. ఆలయం లోపల వివిధ విభాగాలు, క్యూలైన్లలో భక్తుల రద్దీ సాంద్రతను `థ్రెషోల్డ్ మ్యాపింగ్` ద్వారా నిరంతరం విశ్లేషిస్తూ, పరిమితికి మించి రద్దీ పెరిగితే ముందస్తు చర్యల ద్వారా తొక్కిసలాటలు జరగకుండా నివారిస్తామని స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని, జాతర విజయవంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

VC Sajjanar | ప్యాకేజింగ్‌కు.. ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై నిషేధం: సీపీ సజ్జనర్
ఆగస్టు 12, 2026

Faria Abdullah | బోనాల వేడుకలో కంటతడి పెట్టిన జాతిరత్నాలు హీరోయిన్ – తెలంగాణ కల్చర్‌కు ఫిదా
ఆగస్టు 10, 2026

Cyber Frauds | వృద్ధులే సైబర్ కేటుగాళ్ల టార్గెట్!
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు



