Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రపంచ వేదికపై చాటనున్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరుగుతున్న ఆటా (ATA) 19వ మహాసభలకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Mallu Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రపంచ వేదికపై చాటనున్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరుగుతున్న ఆటా (ATA) 19వ మహాసభలకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రవాస తెలుగు సమాజంతో మమేకమయ్యేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయనకు వాషింగ్టన్ డీసీ సమీపంలోని డాలస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC-USA), టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్, అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ అభిమానులు ఆత్మీయంగా ఘన స్వాగతం పలికారు.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. తెలంగాణలో మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికీకరణ, హరిత ఇంధన రంగం, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలపై ప్రవాస భారతీయులకు వివరించనున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలుగువారి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా పలు సమావేశాలు నిర్వహించనున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్వాగతం పలికిన వారిలో IOC-USA ట్రెజరర్ డా. జోషువా జయసింగ్, వర్జీనియా చాప్టర్ అధ్యక్షుడు రాయదాస్ (రాయ్) మంతెన, తెలంగాణ ప్రభుత్వ విజయా డెయిరీ చైర్మన్ అమిత్ రెడ్డి, టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ నరేందర్ యలమరెడ్డి, IOC మిషిగన్ అధ్యక్షుడు శ్రీధర్ పటేల్, IOC నార్త్ కరోలినా అధ్యక్షుడు విద్యాసాగర్ వంగాల, IOC చికాగో అధ్యక్షురాలు బిందు , టీపీసీసీ ఉపాధ్యక్షుడు బి. కైలాష్ కుమార్, ICRM అధ్యక్షురాలు సుచరిత, అదేవిధంగా గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐస్ ఫోరం (USA) అధ్యక్షుడు రాజశేఖర్ కడారి, సాయిరెడ్డి గొంగటి, రాజేందర్ గాజుల, వినయ్ అరెపల్లి, వర్జీనియా రాష్ట్ర కాంగ్రెస్ మద్దతుదారులు శ్రీనివాస్ నడిపల్లి, రవీందర్ నడిపల్లి, రవీందర్ రఘునాయకల, శేఖర్ జువ్వాడి, శ్రీరామ్ ఇత్తరాజు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ●Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
- ●Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
- ●Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
- ●Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు
- ●Varuna Yagam | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని.. ఆగస్టు 10న వరుణ యాగం

Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?

Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..

Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..





