త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Portronics | రూ.5,999కే హోమ్ థియేటర్.. పోర్ట్రోనిక్స్ నుంచి ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2..

Portronics | భారత మార్కెట్లో పోర్ట్రోనిక్స్ కొత్త ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2 150 వాట్ల 5.1 ఛానెల్ హోమ్ థియేటర్ సిస్టమ్‌ను విడుదల చేసింది. లాంచ్ ఆఫర్‌లో ఈ హోమ్ థియేటర్‌ను రూ.5,999కే అందిస్తోంది. దీని అసలు ఎంఆర్‌పీ రూ.9,999గా కంపెనీ ప్రకటించింది. ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2లో వైర్డ్ సబ్‌వూఫర్, సౌండ్‌బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి.

S

Technology | Published On Jul 20, 2026, 4.42 pm IST

Portronics | రూ.5,999కే హోమ్ థియేటర్.. పోర్ట్రోనిక్స్ నుంచి ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2..
Advertisement

Portronics | భారత మార్కెట్లో పోర్ట్రోనిక్స్ కొత్త ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2 150 వాట్ల 5.1 ఛానెల్ హోమ్ థియేటర్ సిస్టమ్‌ను విడుదల చేసింది. లాంచ్ ఆఫర్‌లో ఈ హోమ్ థియేటర్‌ను రూ.5,999కే అందిస్తోంది. దీని అసలు ఎంఆర్‌పీ రూ.9,999గా కంపెనీ ప్రకటించింది. ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2లో వైర్డ్ సబ్‌వూఫర్, సౌండ్‌బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి మొత్తం 150 వాట్ల ఆడియో అవుట్‌పుట్ ను అందిస్తాయి. సినిమాలు, మ్యూజిక్, గేమింగ్, అలాగే లైవ్ స్పోర్ట్స్ వీక్షణ సమయంలో మెరుగైన సౌండ్ అనుభవాన్ని అందించేలా ఈ సిస్టమ్‌ను రూపొందించినట్లు పోర్ట్రోనిక్స్ తెలిపింది.

ఏ డివైస్‌కైనా క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు..

కనెక్టివిటీ పరంగా ఈ హోమ్ థియేటర్‌లో బ్లూటూత్ 5.4, హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ, ఆప్టికల్, యూఎస్‌బీ, ఏయూఎక్స్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా స్మార్ట్ టీవీలు, గేమింగ్ కన్సోల్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇందులో నాలుగు ప్రీసెట్ ఈక్యూ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. మ్యూజిక్, మూవీ, న్యూస్, నైట్ మోడ్‌ల ద్వారా కంటెంట్ రకాన్ని బట్టి ఆడియో సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు.

ప్ర‌త్యేక కంట్రోల్స్‌..

సౌండ్‌బార్‌పై ప్లేబ్యాక్, వాల్యూమ్ నియంత్రణ కోసం ప్రత్యేక కంట్రోల్స్ ఉన్నాయి. శాటిలైట్ స్పీకర్లు కాంపాక్ట్ డిజైన్‌తో ఉండటంతో టీవీ చుట్టూ సులభంగా అమర్చుకోవచ్చు. ప్రత్యేక సబ్‌వూఫర్ బాస్ అవుట్‌పుట్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే వాల్యూమ్, ప్లేబ్యాక్, ఇన్‌పుట్ సెలెక్షన్, ఈక్యూ మోడ్‌లను నియంత్రించేందుకు వైర్‌లెస్ రిమోట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. పోర్ట్రోనిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో ఎక్స్2 ప్రస్తుతం రూ.5,999 ప్రారంభ ధరకు పోర్ట్రోనిక్స్ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement