RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?
RS Praveen Kumar | తాను ‘మహా’ అశ్లీల చానల్‌పై కేసు పెట్టి రెండున్నర నెలలు అవుతుందని.. దాని ఓనర్ వంశీని కనీసం ప్రశ్నించే దమ్ము కూడా మన పోలీసులకు లేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే, చంద్రబాబునాయుడో అర్థం కావడం లేదన్నారు. పోలీసులకు ఎవరి నుంచి ఆదేశాలు అందుతున్నాయోనని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
- ఆ చానల్‌పై కేసు పెట్టి నెలలు గడుస్తున్నా కనీసం ప్రశ్నించే సాహసం చేస్తలేరు
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే, చంద్రబాబో అర్థమైతలే
- అందుకే భయ్యా.. తెలంగాణ పత్రికలనే ప్రోత్సహించాలే
- ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్
త్రినేత్ర.న్యూస్: తాను ‘మహా’ అశ్లీల చానల్‌పై కేసు పెట్టి రెండున్నర నెలలు అవుతుందని.. దాని ఓనర్ వంశీని కనీసం ప్రశ్నించే దమ్ము కూడా మన పోలీసులకు లేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే, చంద్రబాబునాయుడో అర్థం కావడం లేదన్నారు. పోలీసులకు ఎవరి నుంచి ఆదేశాలు అందుతున్నాయోనని వ్యంగ్యంగా పేర్కొన్నారు. అందుకే తెలంగాణ మూలాలు ఉన్న పత్రికలు, చానల్లను మాత్రమే మనం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు.
మహా ఓనర్ వంశీని కనీసం ప్రశ్నించే దమ్ము కూడా పోలీసులకు లేదు. ఏమన్నా అంటే పైనుండి ఆదేశాలు అంటరు. కేటీఆర్‌పై అసత్య, అశ్లీల వార్త రాసినందుకు తెలంగాణ బిడ్డలు నిలదీసి అడిగినందుకు, ఆఫీస్ అద్దాలు పగిలాయని చాలా మంది తెలంగాణ విద్యార్థులను జైల్లో వేసి కొట్టిర్రు. ఏమన్నా అంటే పై నుంచి ఆదేశాలు అంటరు.
వంశీని బచాయించుడేంది?
తెలంగాణ హోంమంత్రి పాలమూరు బిడ్డ అయినప్పుడు తెలంగాణ బిడ్డలను జైలుకు పంపుడేంది? ఆంధ్ర మహా అశ్లీల వంశీని బచాయించుడేంది? నేనూ పాలమూరు బిడ్డనే కదా రేవంత్ గారు? ఇంతకూ తెలంగాణ సీఎం రేవంత్ గారా, లేదా చంద్రబాబు గారా? ఎవరి నుండి ఆదేశాలు వస్తున్నాయి తెలంగాణ పోలీసులకు? అని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
- ●Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..
- ●Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..
- ●Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు
- ●Varuna Yagam | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని.. ఆగస్టు 10న వరుణ యాగం

Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?

Husnabad | హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు..

Stock Markets | ఐటీ షేర్ల జోష్.. మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్ 242 పాయింట్లు డౌన్..





