Suicide Attempt | ప్రభుత్వానికి సూసైడ్ నోట్.. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం
Suicide Attempt | ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిరుత్సాహానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు. గత ఐదేండ్లుగా గ్రూప్స్‌కి సన్నద్ధమవుతున్నప్పటికీ నోటిఫికేషన్లు (Job Notifications) రావడం లేదంటూ ప్రభుత్వానికి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి యత్నించాడు.
Suicide Attempt | త్రినేత్ర.న్యూస్: ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిరుత్సాహానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు. గత ఐదేండ్లుగా గ్రూప్స్‌కి సన్నద్ధమవుతున్నప్పటికీ నోటిఫికేషన్లు (Job Notifications) రావడం లేదంటూ ప్రభుత్వానికి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి యత్నించాడు. తన సూసైడ్ లేఖ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి చేరేవరకు షేర్ చేయాలని కోరాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన గడ్డం వేణు కుమార్ సువర్ణాపురంముత్తారం సమీపంలోని మిషన్ భగీరథ ల్యాబ్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఎలుకల మందు, ఇతర మాత్రలు తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పీజీ వరకు చదువుకున్న అతడు గత ఐదేండ్లుగా గ్రూప్స్ పరీక్షలకు (Groups Exams) సన్నద్ధమవుతున్నాడు. రోజులానే శనివారం కూడా ఇంట్లో నుంచి వెళ్లిన వేణు.. సాయంత్రం సమయంలో నిరుద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో సూసైట్ నోట్ పోస్ట్ చేసి ఎలుక మందు తాగడటంతోపాటు మరికొన్ని మాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రూపులో ఉన్నవారు అప్రమత్తమై వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన అతని తండ్రి .. అపస్మారక స్థితిలో ఉన్న వేణుని ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
‘నా మరణానికి కారణం సరైన సమయానికి గ్రూప్స్ నోటిఫికేషన్లు రాకపోవడమే. గత 5 సంవత్సరాలుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఒక్కసారి మాత్రమే గ్రూప్స్ రాశా. ప్రతి సంవత్సరం జాబ్ కాలెండర్ (Job Calendar) ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వలేదు. జాన్ 2 సందర్భంగా చిన్న చిన్న నోటిఫికేషన్లు ఇస్తున్నారు, కానీ గ్రూప్స్ నోట్రిఫికేషన్ వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ‘జాబ్ కాలెండర్ ఇస్తాము’ అని మానిఫెస్టోలో పెట్టటంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప జాబ్ కాలెండర్ ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం నోటిఫికేషను విడుదల చేస్తే నిరుద్యోగులుకు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఏదో ఒక ఉద్యోగం వస్తుందని వారిమీద వారికి నమ్మకం ఉండేది. రెండు, మూడు సంవత్సరాలు వారి ప్రతిభను పరీక్షించుకుంటారు.
ఐదేండ్లకు ఒకసారి పంచవర్ష ప్రణాళికలా లేదా 10 సంవత్సరాలకి నోటిఫికేషన్స్ ఇస్తే ఎంతో మంది అభ్యర్థులు వారి విలువైన సమయాన్ని, వయస్సును పోగొట్టుకుంటున్నారు. అందులో నేను ఒకడిని. ఐదు సంవత్సరాలుగా గ్రూప్స్ అనే అనే ముసుగులో మునిగిపోయా. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వచ్చి ఉంటే నాక్కూడా ఏదో ఒక జాబ్ వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితులలో అభ్యర్థులు వారి జీవిత కాలంలో 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఒకటి లేదా రెండు నోటిఫికేషన్లు మాత్రమే చూస్తున్నారు. ఇటీవల విడుదలైన పోలీస్ నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులని సంతృప్తి పరచలేదు. రాష్ట్రంలో, వ్యవస్థలో పై స్థాయిలో మార్పులు కనిపిస్తున్నా.. కింది స్థాయిలో వికేంద్రీకరణ జరగడం లేదు. మధిర నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మా అమ్మ మానసిక వికలాంగురాలు. మాకు సొంత ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడూ మంజూరు కాలేదు. 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాము. ఈ నోట్ సీఎం, డిప్యూటీ సీఎం, రాహుల్ గాందీలకు చేరే వరకూ షేర్ చేయాలి’ అని వేణు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!






