Ponnam Prabhakar | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | తెలంగాణ సంప్రదాయాలకు, సంస్కృతి, ఆచారాలకు ఆషాఢ బోనాలు (Bonalu) ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. కులమతాలకు అతీతంగా బోనాల పండుగను జరుపుకుంటారని చెప్పారు.
హైదరాబాద్ నగరానికి సంబంధించి బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఆతిథ్యం ఇవ్వడంలో నగర ప్రజలు ముందుంటారని చెప్పారు. కులాలకతీతంగా మతలకతీతంగా బోనాల ఉత్సవాల్లో భాగస్వామ్యమై జరుపుకుంటారని పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా భక్తుల రద్దీ కూడా పెరుగుతుందని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక విపత్తులు వచ్చినా అమ్మవారు ఆదుకున్నారని తెలిపారు. ప్రజలందరికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలన్నారు. ప్రస్తుతం కూడా ఎల్ నినో విపత్తు వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని బోనాల ఉత్సవాల సందర్భంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ప్రకృతి వైపరీత్యం వచ్చినా తెలంగాణపై అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు కురుస్తాయని తమకు విశ్వాసం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది pic.twitter.com/JXh1TFM05N
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 2, 2026
సంబంధిత వార్తలు

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు
ఆగస్టు 11, 2026

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
ఆగస్టు 11, 2026

Naveen Nicolas | పాఠశాలల భవనాలు పూర్తయ్యేలోపు ఫర్నీచర్ ఉండాలి.. నిధుల సమస్య రాకుండా చూసుకోండి
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!
- ●Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు
- ●Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు

Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో

SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ

‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!

Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!



