Indiramma Illu | 10 ఏళ్లు నివాసముంటేనే హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు.. అర్హతలు ఇవే..!
Indiramma Illu | మీరు హైదరాబాద్( Hyderabad ) నగరంలో నివాసం ఉంటున్నారా..? పదేళ్ల పాటు కనీసం సొంతిల్లు లేకుండా కిరాయి ఇంట్లో( Rent House ) గడుపుతున్నారా..? అయితే మీ లాంటి సొంతిల్లు లేని వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల( Indiramma Illu ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగరం( CURE ) పరిధిలో 10 ఏళ్ల నివాసితులై ఉంటే.. ఈ ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులే. మరి దరఖాస్తుతో పాటు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Indiramma Illu | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 నియోజవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ బస్తీల్లో ఉండే నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే అర్హతలు ఏంటి..? నిబంధనలు ఏంటి..? అనే అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
అర్హతలు ఇవే..
- దరఖాస్తుదారు కనీసం 10 ఏళ్లకు పైగా హైదరాబాద్(క్యూర్) నివాసితుడై ఉండాలి.
- దరఖాస్తుదారు లేదా ఆ కుటుంబానికి ఓఆర్ఆర్ లేదా క్యూర్ ప్రాంతంలో ఇల్లు, ప్లాట్ లేదా ఫ్లాట్ సొంతంగా ఉండకూడదు.
- ఒకే కుటుంబం - ఒకే దరఖాస్తు - ఒకే ఫ్లాట్.
- దరఖాస్తుదారు ఇంతకు ముందు ఇలాంటి గృహ ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు.
- తప్పుడు ప్రకటన, వాస్తవాలను దాచిపెట్టడం లేదా నకిలీ దరఖాస్తు చేయడం వంటివి తిరస్కరణకు /రద్దుకు దారి తీయొచ్చు.
- దరఖాస్తు చేస్తున్న నియోజకవర్గం యూనిట్ నివాసి అయి ఉండాలి.
ఆదాయం
- డిమాండ్ నోటిఫికేషన్ ప్రకారం, వార్షిక కుటుంబం ఆదాయం రూ. 6 లక్షలకు మించరాదు.
దరఖాస్తు విధానం
- మీ-సేవ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.. దరఖాస్తుకు అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతిపదికగా ఉంటుంది.
- ఈఎండీ /టోకెన్ అడ్వాన్స్ : రూ. 10,000
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
- దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సులభతరం చేసింది. ఈ నెల (జులై) 21 నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
- మీసేవ (MeeSeva), వెబ్‌సైట్ లేదా 8096958096 అనే వాట్సప్ (WhatsApp) నంబర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
- దరఖాస్తు సమయంలో రూ. 10,000 చెల్లించాలి. ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఇల్లు వస్తే ఆ పది వేలను లబ్ధిదారుని వాటాలో మినహాయిస్తారు.
ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
- దరఖాస్తు చేసే సమయంలో కుల, జీతభత్యాల లేదా సర్వీసు ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని లాటరీ సమయంలో సమర్పించొచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇలా..
- కార్పెట్ ఏరియా : 400 చదరపు అడుగులు
- బిల్డ్ అప్ ఏరియా : 528 చదరపు అడుగులు
- ప్రభుత్వ రాయితీ : రూ. 5 లక్షలు
- భూమి ఖర్చు : ఉచితం
ముఖ్య నిబంధనలు
- బదిలీ అమ్మకం అద్దెకు ఇవ్వడం కుదరదు.
- 10 ఏళ్ల వరకు లేదా నోటిఫై చేయబడిన లాక్ ఇన్ పీరియడ్ వరకు అమ్మకం లేదా అద్దెకు ఇవ్వడం కుదరదు. గృహ రుణం కోసం బ్యాంకు తనఖా అనుమతించబడింది.
నిర్వహణ మరియు పార్కింగ్
- అప్పగింతకు ముందు నిర్వహణ ప్రణాళిక, సంక్షేమ సంఘం మరియు నిర్వహణ విధి గురించి తెలియజేయవచ్చు.
- ద్విచక్ర వాహనాల పార్కింగ్ మాత్రమే కల్పించబడుతుంది.
రిజర్వేషన్లు ఇలా..
- ఎస్సీలకు - 14 శాతం
- ఎస్టీలకు - 5 శాతం
- బీసీలకు - 16 శాతం
- పీహెచ్ - 5 శాతం
- ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్, నాల్గవ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు - 10 శాతం
- మిగిలిన 50 శాతం వాటా ఇతర దరఖాస్తుదారులకు(జనరల్ కేటగిరీ) కేటాయించబడుతుంది.
ఇండ్ల నిర్మాణాలు చేపట్టే 16 ప్రాంతాలు ఇవే
రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి
మహేశ్వరం: జల్‌పల్లి
శేరిలింగంపల్లి: రాయదుర్గం
ఇబ్రహీంపట్నం: తట్టిఅన్నారం, బండ్లగూడ
మల్కాజిగిరి: కౌకూర్
నాంపల్లి: రెడ్‌హిల్స్, నీలోఫర్ ఆసుపత్రి సమీప పోలీస్ క్వార్టర్స్
ఖైరతాబాద్: హకీంపేట్ దర్గా, జూబ్లీహిల్స్ (ఎమ్మెల్యే కాలనీ)
కార్వాన్: కుల్సుంపురా (పోలీస్ క్వార్టర్స్ సమీపం)
బహదూర్‌పురా: నందిముసలిగూడ
అంబర్‌పేట్: సిటీ పోలీస్ లైన్స్
కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ (KPHB) కాలనీ
మేడ్చల్: పోచారం ఎల్‌ఐజీ (LIG) కాలనీ
కుత్బుల్లాపూర్: గాజులరామారం
సనత్‌నగర్: పాటిగడ్డ
సికింద్రాబాద్ కంటోన్మెంట్: మారేడ్‌పల్లి – మహేంద్రహిల్స్
మలక్‌పేట్: గడ్డిఅన్నారం ఆర్అండ్‌బీ (R&B) క్వార్టర్స్.
సంప్రదించాల్సిన కాల్ సెంటర్ నంబర్లు ఇవే..
8031335905
040-24603572
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..
- ●ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటిన ‘మీసేవ’ లావాదేవీలు
- ●Arvind Kejriwal | ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించాలి.. ఆగస్టు 4న ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన కేజ్రీవాల్
- ●Anupama Parameswaran | బ్రేకప్ రూమర్లపై అనుపమ రియాక్షన్ - నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్స్
- ●V Hanumantha Rao | అయోధ్య విరాళాల చోరీ.. గాంధీ భవన్లో వీహెచ్ వినూత్న నిరసన
- ●KTR | అపొజిషన్ బాగుంది మహేశన్నా : కేటీఆర్

RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..

ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటిన ‘మీసేవ’ లావాదేవీలు

Arvind Kejriwal | ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించాలి.. ఆగస్టు 4న ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన కేజ్రీవాల్

Anupama Parameswaran | బ్రేకప్ రూమర్లపై అనుపమ రియాక్షన్ - నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్స్




