Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ
Hyderabad Biker | సోలోగా బైక్ రైడింగ్‌కు (Bike Rider) వెళ్లిన హైదరాబాద్ యువకుడు హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) అదృశ్యమయ్యారు. రెండు వారాలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇప్పటికీ అతని ఆచూకీ (Hyderabad Biker) లభించలేదు.
Hyderabad Biker | త్రినేత్ర.న్యూస్: సోలోగా బైక్ రైడింగ్‌కు (Bike Rider) వెళ్లిన హైదరాబాద్ యువకుడు హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) అదృశ్యమయ్యారు. రెండు వారాలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇప్పటికీ అతని ఆచూకీ (Hyderabad Biker) లభించలేదు. గత నెల 19న నగరానికి చెందిన బైక్ రైడర్ అనిల్ మర్లా (Anil Marla) హిమాలయాల్లోని అత్యంత మారుమూల పర్వత మార్గమైన లడఖ్‌లోని (Ladakh) పదుమ్ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్-స్పీతి మీదుగా (Lahaul Valley) లేహ్ వైపు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆ మార్గంలోని పర్వత ప్రాంతానికి వెళ్లిన తర్వాత గల్లంతయ్యారు. దీంతో గాలింపు చెపట్టిన ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF) బలగాలకు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉన్న బైక్ లభించింది. అయితే ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోటార్ సైకిల్ రైడర్ అయిన అనిల్.. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో బయోమెడికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా బైక్ రైడింగ్ చేయాలనే కోరికతో ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం హిమాలయాల్లో (Himalayas) బైక్ రైడింగ్ కోసం హైదరాబాద్ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు. గత నెల 16న కిరాయికి తీసుకున్న బైక్‌తో తన యాత్ర ప్రారభించారు. జూలై 19న తన భార్య సుమితా శర్మతో (Sumita Sharma) ఫోన్‌లో మాట్లాడిన ఆయన తాను పదుమ్‌ను దాటి లాహౌల్ లోయలోని (Lahaul-Spiti) జాన్‌స్కార్ ప్రాంతం మీదుగా దర్చా-షింకులా రహదారిపై ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె అనిల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అప్పటి నుంచి ఫోన్ పనిచేయకపోవడంతో.. ఆమె తన సోదరుడు వరుణ్ కలిసి హిమాచల్ వెళ్లారు. అక్కడి కేలాంగ్, పదుమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నప్పకిటీ బైక్ మినహా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు.
కాగా, దర్చా-షింకులా రహదారిపై సుమ్డో మోడ్-3 సమీపంలో (Sumdo Mod 3) అనిల్ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆయన బైక్ లోయలో పడిపోగా, హెల్మెట్‌తోపాటు ఇతర రైడింగ్ పరికరాలు కొండచరియల్లో ఇరుక్కుపోయాయి. ఆ ప్రాంతంలోని భాగా నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయినట్లు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు అక్కడి స్థానికులతో కలిసి గాలిస్తున్నాయి. లోయలు, నదీ తీరాల్లో డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నారు.
తాజావార్తలు
- ●Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు
- ●MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
- ●Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన
- ●Supreme Court | వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధనం..? పరిశీలిస్తున్న కేంద్రం..?
- ●Main Vaapas Aaunga | 'మై వాపస్ ఆవూంగా'... నెట్ ఫ్లిక్స్‌లో ఈ అర్ధరాత్రి నుంచే...
- ●Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'బంగారం' సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు

MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన

Supreme Court | వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధనం..? పరిశీలిస్తున్న కేంద్రం..?






