Road Accident | 250 kmph వేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. ఎగిరిపడ్డ మృతదేహాలు
Road Accident | Road Accident | మహారాష్ట్ర థానే (Thane) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బద్లాపూర్ (Badlapur) సమీపంలో ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వే (Mumbai-Delhi Expressway)పై అతివేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు (BMW Car) డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ తర్వాత పలుమార్లు పల్టీలు కొట్టింది.
Road Accident | పుట్టినరోజు వేడుక తీవ్ర విషాదాంతమైంది. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్ర థానే (Thane) జిల్లాలోని బద్లాపూర్ (Badlapur) సమీపంలో నిర్మాణంలో ఉన్న ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వే (Mumbai-Delhi Expressway)పై ఓ బీఎండబ్ల్యూ కారు (BMW Car) ప్రమాదానికి గురైంది (Road Accident). అతి వేగంగా దూసుకొచ్చిన కారు తొలుత డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం పలుమార్లు పల్టీలు కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ యువతి, యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఓ యువకుడు గాయాలతో బయటపడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బద్లాపూర్ వెస్ట్‌కు చెందిన యోగేష్ నేగి (26) తన పుట్టినరోజు వేడుకల కోసం ఇద్దరు ఫ్రెండ్స్ రెబెక్కా జాకబ్ (24), అంగద్‌తో కలిసి కారులో వెళ్లారు. ఆ సమయంలో అగంద్ కారును డ్రైవ్ చేస్తున్నారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఏరంజాద్ ప్రాంతం వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కన ఉన్న ఇనుప డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఆ తర్వాత పల్టీలు కొట్టుకుంటూ 200 మీటర్ల దూరానికి ఎగిరి పడింది.
ఈ ఘటనలో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అంగద్ ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా ఇద్దరు ఘటనాస్థలంలోనే మరణించారు. వారి బాడీపార్ట్స్ కూడా రోడ్డుపై చెల్లా చెదరుగా పడిపోయాయంటే ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ చేపడుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
Also Read..
లైంగిక ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి కుంభం శివకుమార్ రెడ్డి సస్పెండ్
నెల రోజుల్లోనే ఓటీటీలోకి పెద్ది - రామ్‌చరణ్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
తాజావార్తలు
- ●Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
- ●Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?
- ●Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ నిరుద్యోగం
- ●ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!
- ●Heavy Rain | భారీ వర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆలస్యం
- ●Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?

Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?

Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ నిరుద్యోగం

ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!






