Peddi OTT | నెల రోజుల్లోనే ఓటీటీలోకి పెద్ది – రామ్‌చరణ్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
రామ్‌చరణ్ పెద్ది మూవీ అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Jun 22, 2026, 12.46 pm IST
Peddi OTT | రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో భారీ హైప్ నెలకొన్న సినిమాల్లో ఒకటిగా పెద్ది ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఓపెనింగ్స్‌తో రికార్డులు క్రియేట్ చేసింది. కానీ ఫుల్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. నిజాయితీతో కూడిన ప్రయత్నంగా పేరు తెచ్చుకున్న పెద్ది నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది.
అనుకున్నదానికంటే ముందుగానే...
తాజాగా పెద్ది మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే పెద్ది మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జూలై 2 పెద్ది ఓటీటీలో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత జూలై నెలాఖరున ఓటీటీ ప్రేక్షకుల ముందుకు పెద్దిని తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావించిందట. కానీ థియేటర్లలో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్రావడంతో అనుకున్న దానికంటే రెండు, మూడు వారాల ముందే పెద్ది ఓటీటీలోకి రానున్నట్లు సమాఆరం. ఈ వారంలోనే పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
జాన్వీ రోల్‌పై విమర్శలు...
తన ఊరి సమస్యలు తీర్చడం కోసం క్రాస్ ఓవర్ అథ్లెట్ సాగించిన పోరాటంతో రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీగా బుచ్చిబాబు సానా ఈ స ఇనిమాను తెరకెక్కించారు. రెజ్లర్, క్రికెటర్‌గా రామ్‌చరణ్ చూపించిన వేరియేషన్స్, నటనకు ప్రశంసలు దక్కాయి. యాక్టింగ్ పరంగా రామ్‌చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. కానీ జాన్వీ కపూర్ రోల్‌ను తీర్చిదిద్దిన తీరుతో పాటు ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడం, లాజిక్‌లు చాలా వరకు మిస్ చేయడంపై విమర్శలు వచ్చాయి. థియేటర్లలో మూడు వందల కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ నిర్మాతలకు వంద కోట్ల వరకు నష్టాలను తెచ్చిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో భారీగా వసూళ్లను రాబట్టిన ఈ మూవీ తమిళం, హిందీతో పాటు మిగిలిన భాషల్లో అంచనాలకు తగ్గట్లుగా కలెక్షన్స్ దక్కించుకోలేకపోయింది.
పెద్దిలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
ఆగస్టు 24, 2026

Aishwarya Lekshmi | అల్లు అర్జున్ రాకాలో లేడీ విలన్‌గా మలయాళం హీరోయిన్
ఆగస్టు 24, 2026

Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక – గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం
- ●Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
- ●Fake DSP Arrest Hyderabad | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!



