Allu Arjun | కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. వర్చువల్‌గా హాజరుకు కోర్టు అనుమతించినప్పటికీ ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో కేసు విచారణను న్యాయమూర్తి జూలై 6కి వాయిదా వేశారు.
Allu Arjun | త్రినేత్ర.న్యూస్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. వర్చువల్‌గా హాజరుకు కోర్టు అనుమతించినప్పటికీ ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో కేసు విచారణను న్యాయమూర్తి జూలై 6కి వాయిదా వేశారు.
సంధ్యా టాకీస్ కేసుకు సంబంధించి సోమవారం నాటి విచారణకు అల్లు అర్జున్ సహా అందరూ కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులంతా న్యాయమూర్తి ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. ఆయన తరపున అడ్వకేట్ ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసు విచారణను న్యాయమూర్తి కేసు విచారణను జూలై 6కి వాయిదా వేశారు. తదుపరి హియరింగ్‌కు కూడా వర్చువల్‌గా హాజరవుతారని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచాది.
2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. థియేటర్ యజమాని, సిబ్బందితోపాటు అల్లు అర్జున్‌ను కూడా నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా, ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 23 మంది నిందితులపై పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
తాజావార్తలు
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం
- ●Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
- ●Fake DSP Arrest Hyderabad | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!






