Kumbam Shivakumar Reddy Suspended | లైంగిక ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి కుంభం శివకుమార్ రెడ్డి సస్పెండ్
Kumbam Shivakumar Reddy Suspended | లైంగిక ఆరోపణల నేపథ్యంలో కుంభం శివకుమార్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బాధితురాలు న్యాయ పోరాటానికి దిగుతానని హెచ్చరించడంతో ఎట్టకేలకు స్పందించి చర్యలకు దిగింది.
Kumbam Shivakumar Reddy Suspended | త్రినేత్ర.న్యూస్: లైంగిక ఆరోపణల నేపథ్యంలో కుంభం శివకుమార్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బాధితురాలు న్యాయ పోరాటానికి దిగుతానని హెచ్చరించడంతో ఎట్టకేలకు స్పందించి చర్యలకు దిగింది. శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధికారికంగా ప్రకటించారు.
శివకుమార్‌రెడ్డి తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఆమె ఫిర్యాదును కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. దీంతో ఆమె నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. కోర్టు సూచన మేరకు శివకుమార్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరిపై తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అయినా ఆమె ఫిర్యాదును అధిష్టానం లైట్ తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై న్యాయ పోరాటానికి దిగుతానంటూ బాధితురాలు హెచ్చరించడంతో శివకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధిష్టానం తెలిపింది.
నారాయణపేట డీసీసీ మాజీ (DCC) అధ్యక్షులుగా ఉన్న శివకుమార్‌రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితులు. 2023, ఆగస్టులో బెంగళూరులో నమోదైన ఒక లైంగిక వేధింపుల కేసులో ఆయన వార్తల్లో నిలిచారు. ఈ వివాదంపై స్పందించిన శివకుమార్ రెడ్డి, తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికి కొందరు కుట్ర పన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలలో నారాయణపేట నియోజకవర్గం నుంచి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. తిరుగుబాటుదారుడిగా ఎన్నికలలో పోటీ చేయడానికి ముందే, 2018, నవంబర్లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మళ్లీ పార్టీతో కలిసి నడిచారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం
- ●Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
- ●Fake DSP Arrest Hyderabad | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!



