త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | దూసుకొచ్చిన మృత్యువు.. స్పాట్‌లోనే ఇద్ద‌రు యువ‌కుల మృతి.. ఈ ప్ర‌మాదం జ‌రిగిందిక్క‌డే

Road Accident | రంగారెడ్డి జిల్లా (Rangareddy District) చేవెళ్ల మున్సిపాలిటీ ప‌రిధి దేవునిఎర్రవల్లి వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటుచేసుకుంది.

S

Telangana | Published On Nov 27, 2026, 7.29 pm IST

Road Accident | దూసుకొచ్చిన మృత్యువు.. స్పాట్‌లోనే ఇద్ద‌రు యువ‌కుల మృతి.. ఈ ప్ర‌మాదం జ‌రిగిందిక్క‌డే
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: రంగారెడ్డి జిల్లా (Rangareddy District) చేవెళ్ల మున్సిపాలిటీ ప‌రిధి దేవునిఎర్రవల్లి వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటుచేసుకుంది. బైక్‌ను ఓ ట్యాంక‌ర్ ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కులు (Two young men dead) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

ఇద్ద‌రు యువ‌కులు చేవెళ్ల నుంచి శంకర్‌పల్లి వైపు బైక్‌పై వెళ్తున్నారు. వీరు ప్ర‌యాణిస్తున్న బైక్‌ను ఓ ట్యాంకర్ వేగంగా వ‌చ్చి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్ర‌మాదం ఘ‌ట‌న‌, మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద స్థలాన్ని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement