Road Accident | పెండ్లి బృందం తుఫాన్‌ను ఢీకొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం
Road Accident | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన పెండ్లి వేడుకకు హాజరై (Wedding Celebration) తిరిగి వెళ్తుండగా అనంతపురం (Anantapur) జిల్లా యాడికి మండల పరిధిలోని రాయల చెరువు వద్ద తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది.
Andhra pradesh | Published On Nov 26, 2026, 7.25 am IST
Road Accident | త్రినేత్ర న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన పెండ్లి వేడుకకు హాజరై (Wedding Celebration) తిరిగి వెళ్తుండగా అనంతపురం (Anantapur) జిల్లా యాడికి మండల పరిధిలోని రాయల చెరువు వద్ద తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి తుఫాన్ (Toofan) వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.
ఒక కుటుంబానికి చెందిన సభ్యులు, బంధువులు హైదరాబాద్‌లో (Hyderabad) బుధవారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుక అనంతరం తుఫాన్ వాహనంలో తాడిపత్రికి (Tadipatri) బయలుదేరారు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున రాయలచెరువు సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో నలుగురు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని ప్రభుత్వ దవాఖానకి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●College Hostel | డిగ్రీ కాలేజీ హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి
- ●Horoscope | నవంబర్ 26 రాశిఫలాలు.. ఈ రాశివారికి చిన్న ప్రయాణాలు లాభదాయకం!
- ●Bala Maya Devi | అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోవద్దు
- ●Osmania University | తాగునీటి కోసం రాత్రిపూట ఓయూ విద్యార్థినుల ఆందోళన
- ●Cancer Screening | ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్.. 250 మందికి పైగా మహిళలకు స్క్రీనింగ్!
- ●Rashtrapati Nilayam | రాష్ట్రపతి నిలయం సందర్శనకు బ్రేక్.. జనవరి 2 నుంచి అనుమతి..!

College Hostel | డిగ్రీ కాలేజీ హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి

Horoscope | నవంబర్ 26 రాశిఫలాలు.. ఈ రాశివారికి చిన్న ప్రయాణాలు లాభదాయకం!

Bala Maya Devi | అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోవద్దు

Osmania University | తాగునీటి కోసం రాత్రిపూట ఓయూ విద్యార్థినుల ఆందోళన





