త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JEE aspirant | కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

JEE aspirant | రాజస్థాన్‌ (Rajasthan) కోటా (Kota)లో జేఈఈ విద్యార్థి (JEE aspirant) బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. బుధ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో అత‌డు త‌న గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

D

National | Published On Jun 4, 2026, 5.15 pm IST

JEE aspirant | కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌
Advertisement

JEE aspirant | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. తాజాగా జేఈఈ విద్యార్థి (JEE aspirant) బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్‌ కబీర్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల ఆర్యన్ ఓజా (Aryan Ojha) కోటాలోని రాజీవ్ గాంధీ నగర్‌లో ఉన్న ఓ హాస్ట‌ల్‌లో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, బుధ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో అత‌డు త‌న గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గ‌మ‌నించిన తోటి విద్యార్థులు వెంట‌నే హాస్ట‌ల్ సిబ్బంది, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అనంత‌రం విద్యార్థిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు నిర్ధ‌రించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కుటుంబ స‌భ్యుల‌కు కూడా స‌మాచారం ఇచ్చారు. వారు వ‌చ్చిన త‌ర్వాత పోస్టుమార్టం నిర్వ‌హించ‌నున్నారు. ఆర్య‌న్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కోటాలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో జేఈఈ కోసం కోచింగ్ తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. అత‌డి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భ్యం కాలేదు.

వ‌రుస మ‌ర‌ణాలు..

గ‌త కొంత‌కాలంగా కోటాలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వసతి గృహాల్లోని ఫ్యాన్లకు ఉరివేసుకోవడం, విషం తాగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నీసం ఐదుగురు విద్యార్థులు మ‌ర‌ణించారు. గ‌తేడాది (2025) 15 మందికిపైగా విద్యార్థులు త‌నువు చాలించారు. అంత‌కుముందు ఏడాది అంటే 2024లో 17 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా.. 2023లో ఏకంగా 30 మంది, 2022లో 15 మంది దాకా విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు. 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు మరణించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా కోచింగ్ సెంట‌ర్లు మూత‌ప‌డ‌టంతో 2020, 2021 సంవత్సరాల్లో ఎలాంటి ఆత్మహత్యలు నమోదు కాలేదు.

సుప్రీంకోర్టు సైతం ఆందోళ‌న‌..

ఇలా విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇక ఇలా వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోచింగ్ సెంట‌ర్ల‌కు గ‌తంలో కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. 16 ఏళ్లుపైబ‌డిన విద్యార్థుల‌ను మాత్ర‌మే కోచింగ్ సెంట‌ర్ల‌లో చేర్చుకోవాల‌ని ప‌రిమితి విధించింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే స‌ర‌దు సంస్థ‌ల‌కు రూ.ల‌క్ష జ‌రిమానా విధిస్తామ‌ని కూడా హెచ్చ‌రించింది.

ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా ఫ‌లితం శూన్యం..

విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు కోటా అధికారులు సైతం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ‘కోటా కేర్స్’ ప్రచారం కింద కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లకు కోటా జిల్లా యంత్రాంగం సరికొత్త మార్గదర్శకాలను (New rules) విడుదల చేసింది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా హాస్టల్ గదుల్లో స్ప్రింగ్ తరహా సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండేలా వసతి గృహాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తామన్నారు. అయినా ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు మాత్రం ఆగ‌డం లేదు.

Also Read..

మున్నార్‌లో ప‌డ‌య‌ప్ప విశ్వ‌రూపం.. కారుపై దాడి చేసి విధ్వంసం

ఏఐ బిజినెస్ ఏజెంట్‌ను ప్ర‌వేశపెట్టిన మెటా.. వ్యాపారాల‌కు ఇది గేమ్ చేంజ‌ర్ టూల్‌..

యాక్టింగ్‌కు ప‌నికిరాన‌ని రిజెక్ట్ చేశారు - క‌న్నీళ్లు ఆగ‌లేదు - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కామెంట్స్‌

Advertisement

తాజావార్తలు

Advertisement