Pregnant Woman | 22 ఏళ్లకే ఆరోసారి గర్భందాల్చిన మహిళ.. ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్
Pregnant Woman | రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఓ మహిళ కేవలం 22 ఏళ్లకే ఆరోసారి గర్భం (Pregnant Woman) దాల్చింది. ఇది తెలుసుకున్న వైద్యురాలు ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Pregnant Woman | మన దేశంలో చాలా కుటుంబాలు మగబిడ్డ కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం తొలి కాన్పుల్లో ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా మగబిడ్డ పుట్టే వరకూ తమ ప్రయత్నాలను ఆపడం లేదు. తాజాగా రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఓ మహిళ కేవలం 22 ఏళ్లకే ఆరోసారి గర్భం (Pregnant Woman) దాల్చింది. ఇది తెలుసుకున్న వైద్యురాలు ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ (Baghpat) జిల్లాకు చెందిన ఓ గైనిక్ డాక్టర్ ప్రగ్యా తోమర్ (Dr Pragya Tomar) తాజాగా ఓ వీడియోను పంచుకున్నారు. అందులో ఓ 22 ఏళ్ల యువతి ఇప్పటికే ఐదుగురు పిల్లలకు తల్లైంది. అందులో నలుగురు ఆడపిల్లలు కాగా, ఒక మగబిడ్డ ఉన్నారు. పెద్దమ్మాయి వయసు ప్రస్తుతం ఎనిమిదేళ్లు. అంటే మనం అర్థం చేసుకోవాలని ఆ యువతికి ఏ వయసులో పెళ్లైందో. ఇప్పుడు ఆరోసారి గర్భందాల్చింది. అయితే, ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స కోసం బరౌత్‌లో ఉన్న స్పందన్ ఆసుపత్రికి వెళ్లింది.
అక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రగ్యా తోమర్‌ను సంప్రదించింది. తోమర్ ఆ మహిళను వయసు, ఇతర వివరాల గురించి అడిగింది. అప్పుడు ఆ యువతి తనకు 22 ఏళ్లని, ఆరోసారి గర్భం దాల్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణిని అని చెప్పింది. ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ ఉన్నారని పెద్దమ్మాయి వయసు 8 ఏళ్లు అని వివరించింది. తనకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లైందని తెలిపింది. ఆమె మాటలకు డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇంత చిన్న వయసులోనే ఎందుకు ఇలా వరుసగా పిల్లల్ని కంటున్నారని ప్రశ్నించింది.
అయితే, మరో మగబిడ్డ కావాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని.. అందు వల్లే గర్భం దాల్చాల్సి వచ్చిందని ఆ మహిళ వాపోయింది. యువతి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది (doctor raises alarm). ఇంత చిన్న వయసులోనే ఇలా పదేపదే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలను ఆ యువతికి వివరించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సంబంధిత వార్తలు

Harish Rao | జైసల్మేర్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఎందుకు..? ప్రశ్నార్థకంగా సింగరేణి మనుగడ : హరీశ్‌రావు
మే 26, 2026

111 Trees For Baby Girl | రాజస్థాన్‌లోని ఈ గ్రామంలో ఆడపిల్ల పుడితే పండుగే.. ఒక్కో చిన్నారికి 111 చెట్లు.. రూ.31 వేల డిపాజిట్
మే 24, 2026

NEET UG | రూ.10 లక్షలు పెట్టి పేపర్ కొంటే.. వచ్చింది 107 మార్కులే..
మే 17, 2026
తాజావార్తలు
- ●Ashika Ranganath | అవార్డ్ వేడుకలో ఆషికా రంగనాథ్ - దేవకన్యలా మెరిసిపోయిన కన్నడ బ్యూటీ
- ●Minister Sridhar Babu | అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు : మంత్రి శ్రీధర్ బాబు
- ●Santosh Kumar IIM Bangalore | వడగాల్పులు విపత్తు కాదా? ఐఐఎం వేదికగా జోగినపల్లి సంతోష్ కుమార్ సూటి ప్రశ్న
- ●Anushka Sharma | ఆర్సీబీ మ్యాచ్‌లో అనుష్క శర్మ చేతికి వింత గాడ్జెట్ - నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న డిజిటల్ జపమాల
- ●BJP New State Presidents | బీజేపీలో భారీ ప్రక్షాళన: ఢిల్లీ, పంజాబ్ సహా నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు.. పూర్తి లిస్ట్ ఇదే
- ●Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే అప్డేట్ చేయకపోతే హ్యాకింగ్ ముప్పు..

Ashika Ranganath | అవార్డ్ వేడుకలో ఆషికా రంగనాథ్ - దేవకన్యలా మెరిసిపోయిన కన్నడ బ్యూటీ

Minister Sridhar Babu | అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు : మంత్రి శ్రీధర్ బాబు

Santosh Kumar IIM Bangalore | వడగాల్పులు విపత్తు కాదా? ఐఐఎం వేదికగా జోగినపల్లి సంతోష్ కుమార్ సూటి ప్రశ్న

Anushka Sharma | ఆర్సీబీ మ్యాచ్‌లో అనుష్క శర్మ చేతికి వింత గాడ్జెట్ - నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న డిజిటల్ జపమాల



