త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్

Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలని తాము సూచించిన‌ట్లు ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల‌ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jun 4, 2026, 6.30 pm IST

Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్
Advertisement

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలని తాము సూచించిన‌ట్లు ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ తెలిపారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చెయ్యబోతుందో స్పష్టత లేదన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల‌ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రభుత్వం జీవో 679 పేరుతో ఉద్యమకారుల కమిటీ వేసింది. ఈరోజు జరిగిన ఉద్యమకారుల సమావేశానికి బీఆర్ఎస్ అటెండ్ అయింది. ఉద్యమకారులను బీఆర్ఎస్ అన్ని రకాలుగా ఆదుకుంది. 610 మంది ఉద్యమకారులను గుర్తించి ఆదుకున్న ఘనత కేసీఆర్ ది. 582 మంది కళాకారులను గుర్తించి వారికి ఉద్యోగాలు ఇచ్చాం. శాసన మండలి మాజీ సభ్యుడు కర్నె ప్రభాకర్ సచివాల‌యానికి వెళ్తుంటే రెండు సార్లు ఆపారు. సామాన్య ప్రజలు సచివాలయానికి పోలేని పరిస్థితి ఉంది అని దాసోజు వాపోయారు.

ఈ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నేతలు కె .కిశోర్ గౌడ్, విద్యాసాగర్, వై. సతీష్ రెడ్డి, రాఘవేంద్ర యాదవ్, అంజన్ రావు, రవి నాయక్, శ్రీను నాయక్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement