Anupama Parameswaran | యాక్టింగ్‌కు పనికిరానని రిజెక్ట్ చేశారు – కన్నీళ్లు ఆగలేదు – అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
మలయాళం మూవీ ప్రేమమ్ ఆడిషన్స్‌లో తాను ఫెయిలైనట్లు అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. నటనకే పనికిరానని ఓ డైరెక్టర్ మొహం మీదే చెప్పేశాడని, అతడి మాటలతో ఏడ్చేశానని అన్నది. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన కష్టాలపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుపమ రివీల్ చేసింది.
Entertainment | Published On Jun 4, 2026, 5.00 pm IST
Anupama Parameswaran | మలయాళ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెటిలైపోయింది అనుపమ పరమేశ్వరన్. మాతృభాషలో కంటే తెలుగులోనే ఈ అమ్మడికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అనుపమ అంటే అచ్చ తెలుగు అమ్మాయి అనేంతంగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించిన మరీచిక ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించింది. ప్రస్తుతం హీరోయిన్‌గా భోగి, క్రేజీ కళ్యాణంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది.
కన్నీళ్లు ఆగలేదు...
ఈ సక్సెస్‌లు, ఆఫర్లు అంత ఈజీగా రాలేదని అన్నది. అసలు నటనకే పనికిరానని తన మొహం మీదే ఓ డైరెక్టర్ చెప్పగానే కన్నీళ్లు ఆగలేదని అన్నది. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది అనుపమ.
సినిమాలు చూడటం తప్ప...
"ప్రేమమ్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అటెండ్ అయ్యా. సినిమాలు చూడటం తప్ప అప్పటివరకు ఒక్కసారి కూడా కెమెరా ముందు నటించలేదు. స్క్రిప్ట్ అంటే ఏమిటి? సినిమాలు ఎలా తీస్తారు? డైలాగ్స్ ఎలా చెబుతారన్నది ఏ మాత్రం అవగాహన లేదు. కాలేజీ రోజుల్లో కొన్ని నాటకాలు వేశారు. ఆ అనుభవంతో ఆడిషన్స్‌కు హాజరయ్యా. మేకర్స్ ఇచ్చిన ఓ డైలాగ్‌ను ఎలాంటి ఎమోషన్స్ లేకుండా గడగడా చెప్పేశా. నాలోని భయాన్ని పొగొడుతూ నాలుగైదు సార్లు నాతో డైలాగ్ చెప్పించారు. అయినా నేను మాత్రం నా స్టైల్‌లోనే చెప్పడంతో డైరెక్టర్ ఫైర్ అయ్యారు. యాక్టింగ్‌కు పనికిరానని మొహం మీదే చెప్పేశారు. ఆయన మాటలతో కన్నీళ్లు ఆగలేదు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ రిజెక్షన్ ఎదురవ్వడంతో ఏడుస్తూనే ఇంటికి వెళ్లిపోయా" అని అనుపమ అన్నది.
అక్కడే ఆగిపోయుండేది....
"ప్రేమమ్ సినిమాలో నాకు అవకాశం రాదని కన్ఫామ్ అయిపోయా. ఆడిషన్స్ సంగతే మర్చిపోయా. కానీ పదిహేను రోజుల తర్వాత మరోసారి ఆడిషన్స్‌కు రమ్మని కబురు వచ్చింది. నన్ను ఏడిపించిన డైరెక్టర్‌ను మెప్పించాలని డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి అడిషన్స్ అటెండ్ అయ్యా. డిఫరెంట్ స్టైల్‌లో కెమెరా ముందు నటించి చూపించా. నా యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యి అవకాశం ఇచ్చారు. రెండోసారి ఆడిషన్‌కు రాకపోయుంటే నా జర్నీ అక్కడే ఆగిపోయిండేది" అని చెప్పింది. అలాంటి అనుభవాలు తన లైఫ్‌లో చాలానే ఉన్నాయని, గ్లామర్ రోల్స్ చేయలేనంటూ తనను కాదని మరో హీరోయిన్‌కు చాలా సార్లు ఛాన్స్‌లు ఇచ్చారని అన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam Heroine | చిరంజీవి సినిమా నుంచి మలయాళ బ్యూటీ ఔట్ – ఒప్పుకొని… తప్పుకోవడంపై అనుమానాలు?
జూన్ 4, 2026

Yellamma Movie | ఎల్లమ్మ కు హీరోయిన్ దొరికేదెప్పుడో? – తెరపైకి మలయాళ బ్యూటీ పేరు!
మే 28, 2026

Anupama Parameswaran | డీ గ్లామర్ పాత్రలో అనుపమ – ఆగిపోయిందనుకున్న మూవీ థియేటర్లలోకి….
మే 14, 2026
తాజావార్తలు
- ●Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింట్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్
- ●Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే 'సేఫ్టీ నెట్'గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి
- ●Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్
- ●Rain | జనగామలో దంచికొట్టిన వాన.. కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు
- ●Rajesh Exports Scam | హర్షద్ మెహతా కంటే పెద్ద స్కామ్: రూ.15 లక్షల కోట్ల బోగస్ లెక్కలతో దొరికిపోయిన 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్'

Sathyaraj Daughter | కట్టప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ - మార్ఫింట్ ఫొటోలపై బాహుబలి యాక్టర్ ఫైర్

Revanth Reddy | ఉమ్మడి పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.. కాట్రేవులపల్లి ఎత్తిపోతల పనుల పరిశీలన

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడేందుకు పరుపులనే 'సేఫ్టీ నెట్'గా మార్చి.. 2 లక్షలు నష్టపోయిన వ్యాపారి

Dasoju Sravan | పాఠ్యపుస్తకాల్లో ఉద్యమకారుల చరిత్ర ఉండాలి: ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్



