త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sathyaraj Daughter | క‌ట్ట‌ప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్ – మార్ఫింగ్‌ ఫొటోల‌పై బాహుబ‌లి యాక్ట‌ర్ ఫైర్‌

బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప పాత్ర‌తో ఫేమ‌స్ అయ్యాడు స‌త్య‌రాజ్‌. కూతురి పెళ్లి వార్త‌ల‌తో ఈ త‌మిళ న‌టుడు వార్త‌ల్లో నిలిచాడు. స‌త్య‌రాజ్ కూతురు దివ్య సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కూతురి పెళ్లి వార్త‌ల‌పై స‌త్య‌రాజ్ రియాక్ట్ అయ్యారు.

N

Entertainment | Published On Jun 4, 2026, 6.37 pm IST

Sathyaraj Daughter |  క‌ట్ట‌ప్ప కూతురి సీక్రెట్ మ్యారేజ్  – మార్ఫింగ్‌ ఫొటోల‌పై బాహుబ‌లి యాక్ట‌ర్ ఫైర్‌
Advertisement

Sathyaraj Daughter |  ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప‌గా క‌నిపించాడు త‌మిళ న‌టుడు స‌త్య‌రాజ్‌. ఈ సినిమాతో ఓవ‌ర్‌నైట్‌లో ఫేమ‌స్ అయ్యాడు. ఒక‌ప్పుడు హీరోగా న‌టించిన స‌త్య‌రాజ్‌కు రాని గుర్తింపు, పేరు ప్ర‌ఖ్యాతులు ఒక్క బాహుబ‌లితో వ‌చ్చాయి. అస‌లు పేరు కంటే క‌ట్ట‌ప్ప‌గానే ఫేమ‌స్ అయ్యాడు. బాహుబ‌లి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో పాటు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ నుంచి స‌త్య‌రాజ్‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్నాయి.

స‌త్య‌రాజ్ కూతురు....

తాజాగా త‌న కూతురి పెళ్లి వార్త‌ల‌తో స‌త్య‌రాజ్ వార్త‌ల్లో నిలిచారు. స‌త్య‌రాజ్‌ కూతురు, డీఎంకే లీడ‌ర్ దివ్య సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న‌ట్లుగా గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఓ వ్య‌క్తితో దివ్య క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఇవి పెళ్లి ఫొటోలేన‌ని, తండ్రితో పాటు కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌కుండా ప్రియుడితో దివ్య ర‌హ‌స్యంగా పెళ్లిపీట‌లు ఎక్కిన‌ట్లు త‌మిళ సినీ వ‌ర్గాల్లో ప్ర‌చారం మొద‌లైంది. అంత‌టితో ఆగ‌కుండా దివ్య‌కు ఇప్ప‌టికే రెండు పెళ్లి అయ్యాయ‌ని, ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారంటూ రూమ‌ర్లు వినిపించాయి.

నిజం లేదు...

కూతురి పెళ్లి రూమ‌ర్ల‌ను స‌త్య‌రాజ్ ఖండించాడు. ఈ మేర‌కు ఓ లెట‌ర్‌ను రిలీజ్ చేశాడు. ఈపెళ్లి వార్త‌ల్లో నిజం లేద‌ని ఈ లేఖ‌లో స‌త్య‌రాజ్ పేర్కొన్నాడు. మార్ఫింగ్ ఫొటోల‌తో త‌న కూతురిపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, క‌ష్ట‌ప‌డి త‌న కూతురు దివ్య జీవితంలో ఉన్న‌త స్థాయికి చేరుకున్న‌ద‌ని, ఆమె సాధించిన విజ‌యాల ప‌ట్ల తండ్రిగా గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని స‌త్య‌రాజ్ అన్నాడు.
వైర‌ల్ ఫొటోల‌పై స‌త్య‌రాజ్ కూతురు దివ్య కూడా రియాక్ట్ అయ్యింది.ఏఐ సాయంతో క్రియేట్ చేసిన ఫొటోలు అవ‌నీ, ఆ ఫొటోల్లో ఉన్న‌ది తాను కాద‌ని చెప్పింది. మీకు ముగ్గురు పిల్ల‌లు ఉన్న‌ది నిజ‌మేనా అంటూ ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్‌కు ఫ‌న్నీ ఎమోజీ జోడించింది.

పెళ్లి చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు...

పిల్ల‌ల‌ను క‌న‌డానికి పెళ్లి చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదంటూ గ‌తంలో దివ్య చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ‌నాట వివాదానికి దారితీశారు. పెళ్లి చేసుకోకుండా బిడ్డ‌ను క‌న‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. కూతురి కామెంట్ల‌పై స‌త్య‌రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె మాట‌ల్లో ఎలాంటి త‌ప్పులేద‌ని అన్నాడు. పెళ్లి అన్న‌ది కూతురి వ్య‌క్తిగ‌త ఇష్ట‌మ‌ని, త‌న ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌ను గౌర‌విస్తాన‌ని అన్నాడు. న్యూట్రీష‌నిస్ట్ అయిన దివ్య ఇటీవ‌లే డీఎంకే పార్టీలో చేరింది.

 

Advertisement
Advertisement