Rahul Gandhi | 10 ఏళ్లలో 152 పేపర్‌లీక్‌లు.. కేంద్రంపై రాహుల్ ధ్వజం
Rahul Gandhi | దేశానికి అత్యంత విలువైన ఆస్తి లాంటి విద్యా వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. గత పదేళ్లలో 152 పేపర్ లీకులు (paper leaks) జరిగాయని చెప్పారు. ఆయా కేసులకు సంబంధించి ఒక్కరికి కూడా శిక్ష పడలేదన్నారు.
Rahul Gandhi | నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్లలో 152 పేపర్ లీకులు (paper leaks) జరిగాయని ఆరోపించారు. అయితే, ఆయా కేసులకు సంబంధించి ఒక్కరికి కూడా శిక్ష పడలేదన్నారు. జవాబుదారీతనాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బుధవారం సాయంత్రం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. "మన విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చివరి నిమిషంలో ప్రశ్నాపత్రం లీకైందని చెబుతున్నారు. ఇక్కడ తీవ్రమైన సమస్య ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇప్పుడు మన దేశంలో చాలా పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మన విద్యావ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయన్న విషయం ప్రతి ఒక్కరికీ చాలా స్పష్టంగా అర్థమవుతోంది" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
గత 10 ఏళ్లలో 152 పేపర్ లీకులు
గత పదేళ్లలోనే మన దేశంలో 152 పేపర్‌లీక్ ఘటన జరిగాయని రాహుల్ ఆరోపించారు. ఈ పేపర్ లీకేజీల వల్ల 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పారు. నష్టపోయిన విద్యార్థులు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారేనని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎంత బాధపడుతున్నా ప్రభుత్వం లెక్కచేయడం లేదని మండిపడ్డారు.
దేశ విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారు
దేశానికి అత్యంత విలువైన ఆస్తి లాంటి విద్యా వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు. పేపర్ లీక్ కేసుల్లో ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్.. యువత నిరసనలకు ఇది బలమైన కారణమని చెప్పారు. దేశ యువతకు ఉద్యోగాలు లేవన్నారు. విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ప్రతీ యువకుడికీ తెలుసునని రాహుల్ అన్నారు. ఒకే ఒక్క పోటీ పరీక్ష కోసం కుటుంబాలు భరించే ఖర్చు.. దేశం మొత్తానికి కేటాయించే విద్యా బడ్జెట్‌తో సమానంగా ఉంటోందని రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనలపై కూడా రాహుల్ తీవ్రంగా స్పందించారు. మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది..?
వారు చేసిన తప్పేంటి..? అంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలపడం నేరమా..? అంటూ నిలదీశారు.
ఆ బాధ్యత ప్రతిపక్షంపై ఉంది
అదే సమయంలో దేశంలోని విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నప్పుడు వారితో నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నివాసం వద్ద నిరసనను రాహుల్ సమర్థించుకున్నారు. విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని.. ఈ సంక్షోభానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల డిమాండ్లు ఇవే..
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువత కోరుకుంటోందని రాహుల్ తెలిపారు.
- ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కావాలని, ఆందోళన చేస్తున్న యువతపై దాడి చేసిన వారికి శిక్షపడాలని యువత కోరుకుంటున్నట్లు చెప్పారు.
- ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు.

Also Read..
నీట్‌ను రద్దు చేయడమే.. సమస్యకు ఏకైక పరిష్కారం : టీవీకే
మీరు దేశానికి చాలా అవసరం.. దీక్ష విరమించండి.. వాంగ్‌చుక్‌కు దిప్కే విజ్ఞప్తి
రూ.5 వేలతో పోస్టాఫీస్ ఫ్రాంచైజీ.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయం పొందే అవకాశం..
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






