త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Post | రూ.5 వేలతో పోస్టాఫీస్ ఫ్రాంచైజీ.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయం పొందే అవకాశం..

India Post | ప్రస్తుత కాలంలో చాలా మంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటున్నాడు. అయితే పెట్టుబడి లేకపోవడం, పెట్టిన డబ్బు పోతుందేమో అన్న భయం చాలామందిని వెనక్కి నెడుతోంది. అలాంటి వారికి తక్కువ పెట్టుబడితో జీవితాంతం కొనసాగే భద్రమైన వ్యాపార అవకాశాన్ని ఇండియా పోస్ట్ అందిస్తోంది.

S

Business | Published On Jul 22, 2026, 5.20 pm IST

India Post | రూ.5 వేలతో పోస్టాఫీస్ ఫ్రాంచైజీ.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయం పొందే అవకాశం..
Advertisement

India Post | ప్రస్తుత కాలంలో చాలా మంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటున్నాడు. అయితే పెట్టుబడి లేకపోవడం, పెట్టిన డబ్బు పోతుందేమో అన్న భయం చాలామందిని వెనక్కి నెడుతోంది. అలాంటి వారికి తక్కువ పెట్టుబడితో జీవితాంతం కొనసాగే భద్రమైన వ్యాపార అవకాశాన్ని ఇండియా పోస్ట్ అందిస్తోంది. కేవలం రూ.5వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి పోస్టాఫీస్ ఫ్రాంచైజీ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ మద్దతుతో ఈ ఫ్రాంచైజీ ద్వారా ప్రతి నెలా మంచి కమిషన్ ఆదాయం పొందవచ్చు. సాధారణంగా ఏదైనా కొత్త కంపెనీ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది. కానీ దేశంలోని చాలా మంది స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఇండియా పోస్ట్ చాలా తక్కువ ఖర్చుతో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో మోసపోయే ప్రమాదం లేదా పెట్టుబడి కోల్పోయే రిస్క్ దాదాపు ఉండదు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని భావించే వారికి ఈ పోస్టాఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ మంచి అవకాశంగా చెప్పవచ్చు.

క‌మిష‌న్‌ను బ‌ట్టి ఆదాయం..

ఈ ఫ్రాంచైజీ ద్వారా వచ్చే ఆదాయం అందులో అందించే సేవలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి సేవకు పోస్టల్ శాఖ నిర్ణయించిన కమిషన్ లభిస్తుంది. రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్‌కు ఒక్కో దానికి రూ.3 కమిషన్, స్పీడ్ పోస్ట్ బుకింగ్‌కు రూ.5 కమిషన్ అందుతుంది. రూ.100 కంటే ఎక్కువ విలువైన మనీ ఆర్డర్‌లపై 3.50 శాతం కమిషన్ లభిస్తుంది. పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయాలపై 5 శాతం లాభం వస్తుంది. రెవెన్యూ స్టాంపుల విక్రయాలపై 4 శాతం వరకు కమిషన్ పొందే అవకాశం ఉంటుంది. రోజూ అధిక సంఖ్యలో స్పీడ్ పోస్ట్‌లు, రిజిస్టర్డ్ పోస్టులు, పార్సిళ్లు బుక్ చేయగలిగితే నెలకు రూ.20వేల నుంచి రూ.50వేలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

అర్హ‌త‌లు ఇవే..

ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ పొందేందుకు అర్హతలు కూడా చాలా సులభంగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తుదారు వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని నిర్వహించేందుకు చిన్న దుకాణం లేదా మార్కెట్‌లో ప్రత్యేక స్థలం ఉండాలి. కంప్యూటర్, ఇంటర్నెట్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే పనులు మరింత సులభంగా నిర్వహించవచ్చు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయడం కూడా చాలా సులభం. ఇందుకోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిగా నింపిన ఫామ్‌ను సమీపంలోని హెడ్ పోస్టాఫీస్‌లో సమర్పించాలి. దరఖాస్తు ఎంపికైన తర్వాత పోస్టల్ శాఖతో ఎంఓయూ (ఎంఓయూ) కుదురుతుంది. అనంతరం అధికారికంగా పోస్టాఫీస్ భాగస్వామిగా మారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

Advertisement
Advertisement