NEET 2026 paper leak | నీట్ ప్రశ్నపత్రం లీక్..? అసలు పరీక్షా పత్రంతో సరిపోలిన మెటీరియల్‌లోని 140 ప్రశ్నలు
NEET 2026 paper leak | వైద్యవిద్య కోర్సుల్లో (Medical Courses) ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2026 (NEET UG-2026 Exam)’ ప్రశ్నపత్రం లీక్ (Paper Leak) కలకలం సృష్టిస్తోంది.
NEET 2026 paper leak | వైద్యవిద్య కోర్సుల్లో (Medical Courses) ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2026 (NEET UG-2026 Exam)’ ప్రశ్నపత్రం లీక్ (Paper Leak) కలకలం సృష్టిస్తోంది. పరీక్షకు ముందు రాజస్థాన్ (Rajasthan)లో పంపిణీ చేసిన మెటీరియల్‌తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు (నీట్ పరీక్షలోని మొత్తం 720 మార్కులకు గాను) పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) అధికారులు విచారణ చేపట్టారు.
మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నల్లో సుమారు 140 ప్రశ్నలు.. పరీక్షకు ముందే లభ్యమైన ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్‌లోని ప్రశ్నలతో పోలిఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ గెస్ పేపర్ పరీక్షకు రెండు రోజుల ముందే అంటే మే1వ తేదీనే రాజస్థాన్‌లోని సికార్‌లో అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఈ ప్రశ్నపత్రాన్ని రూ.20 వేల నుంచి రూ.2లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతేకాదు పరీక్షకు ముందు పంపిణీ అయిన మెటీరియల్‌లో ఉన్న ప్రశ్నలే కాకుండా.. వాటిలోని సమాధానాల ఆప్షన్ల వరుస క్రమం కూడా అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా, లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా..? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఎంబీబీఎస్ విద్యార్థి పనే ఇది..
ఆ ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా తేలింది. సదరు విద్యార్థి మే 1న సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్‌ను పంపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అది పీజీ, కోచింగ్ నెట్‌వర్క్‌లు, కెరీర్ కౌన్సెలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరినట్లు వెల్లడైంది. ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని, ఆ ప్రశ్నపత్రం అంతటా ఒకేరకమైన హ్యాండ్‌రైటింగ్ ఉందని అధికారులు పేర్కొన్నారు. అందులోని సుమారు 140 ప్రశ్నలు అసలు పరీక్షలోని ప్రశ్నలతో ఖచ్చితంగా సరిపోలాయని చెప్పారు. నీట్ (NEET) పరీక్షలో ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. పేపర్ లీక్ ఆరోపణలు నిజమని రుజువైతే.. ర్యాంకులు, అడ్మిషన్లపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

NTA ఏమన్నదంటే..?
ఈ పేపర్ లీక్ ఘటనపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) స్పందించింది. నీట్ యూజీ 2026కి సంబంధించి అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని పేర్కొంది. ఆ సమాచారాన్ని తదుపరి చర్యల కోసం సంబంధిత సంస్థలకు పంపినట్లు NTA తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, దీన్ని పారదర్శకంగా పరిశీలించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
విపరీతంగా ఫార్వర్డ్..
ఈ మెటీరియల్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులకు చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు, ఇది విపరీతంగా ఫార్వర్డ్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పరీక్షకు ముందే ఈ మెటీరియల్ పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు చేరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా.. దీని ప్రింటెడ్ కాపీలను ఆఫ్‌లైన్‌లో కూడా పంపిణీ చేశారా అనే కోణంలో అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
Also Read..
సోమనాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు
ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్.. విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష ఫస్ట్ పోస్ట్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
- ●Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
- ●Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
- ●LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?






