Eight labourers died | రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో 8 మంది కూలీలు మృతి
Eight labourers died | రాజస్థాన్ (Rajasthan) ఝుంఝును (Jhunjhunu) జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా (road construction work) విద్యుదాఘాతానికి గురై ఎనిమిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు (Eight labourers died).
త్రినేత్ర న్యూస్ : రాజస్థాన్‌లో (Rajasthan) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఝుంఝును (Jhunjhunu) జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి (electrocuted) గురై ఎనిమిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు (Eight labourers died). రోడ్డు నిర్మాణ పనుల కోసం ఉపయోగిస్తున్న కంకర మిషన్‌కు విద్యుత్ తీగలు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్‌పుర్‌వాటి ప్రాంతంలోని ఛపోలీ గ్రామంలో (Chhapoli village) ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సహకారంతో ఛపోలి నుంచి కదమ్‌కుండ్ ప్రాంతం వరకూ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా కంకర కలపడానికి ఉపయోగిస్తున్న యంత్రం హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఎనిమిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘోర ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మరణం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Also Read..
అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు
ప్రయాణికులకు ఊరట.. విమాన ఛార్జీలపై కొత్త రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్రం
పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంటది..?
- ●KTR | హైదరాబాదే కాదు.. పల్లెల్లోనూ ఐటీ కంపెనీలు పెట్టుకోవచ్చు
- ●Rababaali OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రణబాలి - విజయ్, రష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్
- ●Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు
- ●Raptadu | రెండు కాళ్లలో మూడు బుల్లెట్లు.. రాప్తాడు దాడి నిందితుడికి శస్త్రచికిత్స
- ●Kishan Reddy | నేషనల్ లీడర్ కావాలని రేవంత్ ఆరాటపడుతుండు

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంటది..?

KTR | హైదరాబాదే కాదు.. పల్లెల్లోనూ ఐటీ కంపెనీలు పెట్టుకోవచ్చు

Rababaali OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రణబాలి - విజయ్, రష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్

Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు






