త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Massive explosion on a railway track | ప్ర‌యాణికుల రైలు వెళ్లిన కొద్దిసేప‌టికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు

Massive explosion on a railway track | రాజ‌స్థాన్‌ (Rajasthan)లోని భారత్‌-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు (India Pakistan international border) సమీపంలో ఓ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు సంభ‌వించింది. అనూప్‌గఢ్‌-సూరత్‌గఢ్‌ రైల్వే మార్గంలో (Suratgarh-Anupgarh route)లో మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌యాణికుల రైలు వెళ్లిన గంట వ్య‌వ‌ధిలోనే పేలుడు చోటు చేసుకుంది.

D

National | Published On Nov 4, 2026, 1.04 pm IST

Massive explosion on a railway track | ప్ర‌యాణికుల రైలు వెళ్లిన కొద్దిసేప‌టికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు
Advertisement

massive explosion on a railway track | త్రినేత్ర న్యూస్ : రాజ‌స్థాన్‌ (Rajasthan)లోని భారత్‌-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు (India Pakistan international border) సమీపంలో గ‌ల‌ రామ్‌సింగ్‌పూర్ ప్రాంతంలో ఓ రైల్వే ట్రాక్‌ (railway track)పై భారీ పేలుడు క‌ల‌క‌లం (massive explosion on a railway track) రేపింది. శ్రీ‌గంగాన‌గ‌ర్ జిల్లాలోని అనూప్‌గఢ్‌-సూరత్‌గఢ్‌ రైల్వే మార్గంలో (Suratgarh-Anupgarh route) మంగ‌ళ‌వారం రాత్రి 50 జీబీ గ్రామం స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ప్యాసింజ‌ర్ రైలు ఆ మార్గం గుండా వెళ్లిన సుమారు 45 నిమిషాల త‌ర్వాత పేలుడు సంభ‌వించిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది.

పేలుడు ధాటికి ట్రాక్ క్లిప్‌లు ఊడిపోయి, రెండు సిమెంట్ దిమ్మెలు దెబ్బ‌తిన్న‌ట్లు పోలీసులు తెలిపారు. అక్క‌డ సుమారు రెండు అడుగుల లోతైన గొయ్యి ఏర్ప‌డింద‌ని చెప్పారు. సంఘటన స్థలానికి సుమారు 200 మీటర్ల దూరంలో నివసించే గ్రామస్థులు పేలుడు శబ్దం విని రైల్వే ట్రాక్ వైపు పరుగులు తీశారు. అనంత‌రం వారు ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆ మార్గంలో రైళ్ల రాక‌పోక‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రయాణికుల రైలు వెళ్లిన గంటకే

పేలుడు ఘ‌ట‌న‌కు ముందు ఆ ట్రాక్‌పై ఓ ప్యాసింజ‌ర్ రైలు వెళ్లింది. రాత్రి 8:30 గంటలకు అనూప్‌గఢ్ జంక్షన్ నుంచి సూరత్‌గఢ్ బయలుదేరిన ప్యాసింజర్ రైలు రాత్రి 9: గంటల స‌మ‌యంలో ఈ ప్రాంతం గుండా వెళ్ళింది. రైలు వెళ్లిన స‌రిగ్గా గంట స‌మ‌యానికి పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు శ‌బ్దం దాదాపు 200 మీట‌ర్ల దూరం వ‌ర‌కూ వినిపించిన‌ట్లు స్థానికులు తెలిపారు. ప్రయాణికుల రైలు వెళ్లిన సరిగ్గా గంట వ్యవధిలోనే ఈ ప్రమాదం జరగడంతో తీవ్రమైన భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికుల రైలును లక్ష్యంగా ఉగ్ర‌వాదులు కుట్ర ప‌న్నార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Also Read..

అదిరిపోయే దీపావ‌ళి గిఫ్ట్.. ఉద్యోగుల‌ను ఐఫోన్లతో స‌ర్‌ప్రైజ్ చేసిన‌ సంస్థ‌

నేను బ్యాలెట్‌లో లేను.. లేదంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ట్రంప్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

ట్రంప్‌న‌కు మిడ్ ట‌ర్మ్‌ షాక్‌.. సెనేట్‌, ప్ర‌తినిధుల స‌భ విప‌క్షాల వ‌శం..

ట్యాగ్స్:

India Pakistan International BorderMassive Explosion On A Railway TrackRailway TrackRajasthanSuratgarh Anupgarh Route
Advertisement
Advertisement